Hot Posts

6/recent/ticker-posts

టీడీపీ, జనసేన అధికారంలోకి వస్తేనే గ్రామాలు అభివృద్ధి..


 
పల్లంకుర్రులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్ధి సుబ్బరాజు

Dr.BRA Konaseema, కాట్రేనికోన: చంద్రబాబునాయుడు, పవన్‌ కల్యాణ్‌ సారధ్యంలోని టీడీపీ, జనసేన ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో అభివృద్ధితోపాటు సంక్షేమం అమలు అవుతుందని మాజీ ఎమ్మెల్యే, ముమ్మిడివరం టీడీపీ, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు(బుచ్చిబాబు) అన్నారు. 

ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా కాట్రేనికోన మండలంలోని పల్లంకుర్రు గ్రామంలోని రామాలయం పేటలో శనివారం అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ ఇంచార్జ్‌ గంటి హరీష్‌ మాధూర్‌ బాలయోగితో కలిసి ఇంటింటా తిరిగి రాబోయే ఎన్నికల్లో సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్ధించారు. రామాలయం పేటలోని వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని కరపత్రాన్ని స్వామి సన్నిధిలో ఉంచి పండితుల ఆశీర్వచనాన్ని స్వీకరించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి సుబ్బరాజు మాట్లాడుతూ గడచిన అయిదేళ్ల కాలంలో గ్రామాల్లో అభివృద్ధి అనేదే లేకుండా పోయిందని, తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో వేసిన రోడ్లు తప్ప పల్లంకుర్రు గ్రామంలో అభివృద్ధి శూన్యం అన్నారు. 

రాబోయే ఎన్నికల్లో సైకిల్‌ గుర్తుపై ఓటువేసి గెలిపించాలని, అధికారంలోకి వచ్చిన వెంటనే పల్లంకుర్రు గ్రామంలో అపరిష్కృతంగా ఉండిపోయిన ప్రతీ సమస్యను సత్వర పరిష్కారం చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. ఈ వైసీపీ అరాచక పాలనలో దోచుకోవడం, దాచుకోవడం తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదని, ప్రతీ గ్రామంలోనూ ప్రజాధనం దోపిడీయే లక్ష్యంగా ఈ పాలకులు వ్యవహరించారని, ప్రజలు దీనిని గ్రహించి తమ ఓటుతో తగిన బుద్దిచెప్పాలని కోరారు. అధోగతి పాలవుతోన్న రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టాలంటే చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ల నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి రావాలని దానికి అనుగుణంగా ప్రతీ ఒక్కరు బాద్యత కలిగి ఈ ఎన్నికల్లో సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. 

పల్లంకుర్రు గ్రామంలోని రామాలయంపేటలో ప్రజలు సుబ్బరాజు దృష్టికి వచ్చిన సమస్యలు విని తాను గెలిచిన వెంటనే పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు. అలాగే వై.ఎస్.ఆర్.సి.పి. సీనియర్ లీడర్స్ గెడ్డం శ్రీను, సాపే నాగేశ్వరావు ఇద్దరు తెలుగుదేశం పార్టీలో చేరారు. జైభీమ్ నగర్ లో వెంట్రు సుధీర్ ఆద్వర్యంలో ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్ధి దాట్ల సుబ్బరాజు(బుచ్చిబాబు), అమలాపురం పార్లమెంట్ ఇన్ ఛార్జ్ గంటి హరీష్ మధుర్ సమక్షంలో సుమారు 30 మంది తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో గంటి శాంతమ్మ, గంటి ఆధిలక్ష్మి, నేలపాటి దుర్గ, గంటి పాపాయమ్మ నేలపాటి రమణ, సవరపు యేసు, గంటి సాయి కిరణ్, నేలపాటి రాజు, రావుర్తి నవీన్ ఇంకా యువకులు, మహిళలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగదేశం, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.