Hot Posts

6/recent/ticker-posts

వైఎస్సార్ సీపీకి అన్నివర్గాల ప్రజల నుంచి విశేష ఆదరణ ఉంది: నియోజకవర్గ కో ఆర్డినేటర్ వరుపుల సుబ్బారావు


కాకినాడ జిల్లా: ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం చిన్నింపేట గ్రామంలో ప్రత్తిపాడు నియోజవర్గ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఇన్చార్జి వరుపుల సుబ్బారావు గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం బుధవారం సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన ఇంటింటికీ వెళ్లి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గత నాలుగున్నరేళ్లలో ప్రభుత్వ పథకాల రూపంలో ప్రతి కుటుంబానికీ చేకూరిన లబ్దిని వివరించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో పార్టీలకు అతీతంగా అన్నివర్గాల వారికి సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఘన విజయం సాధించడం ఖాయమన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్నికుట్రలు పన్నినా వైఎస్సార్ సీపీ విజయాన్ని ఆపలేరన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు యల్లపు విష్ణు, సచివాలయం కన్వీనర్ వేగు కృష్ణ కుమారి, కార్యకర్తలు పత్తి వీరబాబు, రగుమండ నాని, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.