Dr. బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి గన్నవరం: 30 పడకల ప్రభుత్వాసుపత్రి నందు మాతృమూర్తి విగ్రహానికి మమత స్వచ్ఛంద సేవ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కోరుకొండ జాన్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనముగా నిర్వహించరు. ఈ కార్యక్రమంలో స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ శిల్పా.. మాతృమూర్తి విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మమత స్వచ్ఛంద సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కోరుకొండ జాన్ మాట్లాడుతూ.. మహిళలలను రక్షించడానికి ఎన్ని చట్టాలు ఉన్న మహిళలకు బాలికలకు పాఠశాలలోనూ ప్రభుత్వ కార్యాలయంలోను వేధింపులు ఎక్కువ ఉన్నాయని తెలిపారు. మహిళలను వేధించే వారిని కులమత బేధాలు లేకుండా న్యాయపరమైన చట్టాలను కఠినముగా అమలుపరిచి బాధితులకు న్యాయం చేయాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పశ్చిమగోదావరి జిల్లా దళిత ఉద్యోగుల సంక్షేమ సంఘం మాజీ జిల్లా అధ్యక్షుడు, బి ఎస్ ఎన్ ఎల్ వి ఆర్ ఎస్ జూనియర్ ఇంజనీర్ బొడ్డు విక్టర్ బాబు, మదర్ తెరిస హెల్పింగ్ అసోసియేష్ వ్యవస్థాపకుడు డాక్టర్ సాక రాజు, సిస్టర్ బొడ్డు హేమా పలువురు మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ వైద్య సిబ్బంది నర్సులు పాల్గొని మాతృమూర్తి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.