Hot Posts

6/recent/ticker-posts

మద్ది ఆంజనేయస్వామి వారికి 108 సార్లు “హనుమాన్ చాలీసా” పారాయణం


ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం: మండలంలోని గురవాయిగూడెం గ్రామము నందు తెల్ల మద్ది చెట్టు క్రింద స్వయంభువులై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి దర్శనార్ధము మంగళవారం సందర్భముగా వేలాది మంది భక్తులు బారులుతీరి దర్శించుకున్నారు. 

తెల్లవారుఝామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాతసేవ, నిత్యార్చన పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. స్వామివారికి ప్రీతికరమైన తమలపాకులతో అష్టోత్తర పూజలు నిర్వహించారు. భక్తులు శ్రీస్వామి వారి ఆలయము చుట్టూ 108 ప్రదక్షణలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులచే అన్నప్రాసనలు, వాహన పూజలను జరిపించుకున్నారు. ఖమ్మం జిల్లా, భీమవరం గ్రామానికి చెందిన భక్త్తాంజనేయ భజన సమాజం వారు 108 సార్లు “హనుమాన్ చాలీసా” పారాయణం చేశారు.  

మద్యాహ్నం వరకు దేవస్థానమునకు వివిధ సేవల రూపేణ రూ.1,14,025/- లు సమకూరింది. సుమారు 800 మంది భక్తులకు స్వామి వారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ చేశారు. శ్రీ స్వామివారి దర్శనముంకు విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా ఆలయ ధర్మకర్త జెట్టి దుర్గమ్మ, పర్యవేక్షకులు కురగంటి రంగారావు పర్యవేక్షణలో తగిన ఏర్పాట్లు గావించినట్లు ధర్మకర్తల మండలి అద్యక్షురాలు శ్రీమతి సరిత విజయభాస్కర్ రెడ్డి, కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు.