Hot Posts

6/recent/ticker-posts

ఐషర్ వ్యానులో తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత..


ఐషర్ వ్యానులో తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత..

పట్టుకున్న పోలీస్, రెవిన్యూ అధికారులు..

తూర్పు గోదావరి జిల్లా, గోపాలపురం: రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్నట్లు ఎస్ ఐ కె. సతీష్ కుమార్ తెలిపారు. అయన తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణ రాష్ట్రం సత్తుపల్లి నుండి రాజమండ్రి తరలిస్తున్న ఏపీ 05 టి యు 4356 నెంబర్ గల ఐషర్ వ్యానులో 130 క్వింటాల బియ్యాన్ని తరలి స్తుండగా గోపాలపురం వద్ద పోలీస్ రెవిన్యూ అధికారులకు పెట్టుకున్నారు. వారికి అందిన సమాచారం ప్రకారం తనిఖీలు నిర్వహించగా ఆ తనిఖీలో రేషన్ బియ్యం పట్టుబడినట్లు వారు తెలిపారు. బియ్యం విలువ 2లక్షల రూపాయలు ఉంటుందన్నారు. కాకినాడకు సంబందించిన ఐషర్ డ్రైవర్ ఆల్లు మల్లు రామును అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. పట్టుకున్న లారిని సివిల్ సప్లై డీటీ కి అప్పగించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.