ఏలూరు/భీమడోలు: మాకు తెలియకుండా.. అక్రమంగా చేపలు సాగు నిర్వహిస్తూ.. నాపై దౌర్జన్యంగా అన్నం రెడ్డి నాగరాజు అను వ్యక్తి వ్యవహరిస్తున్నాడని సోమవారం సాయంత్రం భీమడోలు పోలిస్ స్టేషన్ లో, తాశీల్ధార్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడం జరిగిందని మధుఖాన్ కంపెనీ ప్రతినిధి నామా సుభాష్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గత 20 సంవత్సరాల నుండి మధుఖాన్ కంపెనీలో తాను గుమాస్తాగా పని చేస్తున్నానని, కంపెనీకి సంబంధించినటువంటి భీమడోలు మండలం అంబర్ పేట పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 452/2, 452/3 లలో సుమారు 8.76 ఏకరాల భూమి కలదని, దాని బాగోగులు తననే చూడవలసినదిగా కంపెనీ వారు తనను నియమించడం జరిగిందన్నారు.
అయితే నేను గత నాలుగు సంవత్సరాలుగా ప్రతి నెలలో, 15 రోజులకు ఒకసారి ఇక్కడకు వచ్చి పొలానికి సంబంధించిన బాగోగులు చూస్తుంటానని తెలిపారు. అందులో భాగంగా ఈ మధ్య కాలంలో రావడం జరిగిందని, వచ్చి చూడగా సుమారు 50 సెంట్లు భూమిలో కంకర దిబ్బను జెసిబితో త్రోవి ఇతర వాహనాలతో తరలించడం జరిగిందని తెలిసిందన్నారు. అంతేకాక పొలములో అన్నం రెడ్డి నాగరాజు దొంగతనంగా నీళ్ళను నింపి చేపలు పెంపకం చేస్తున్నాడని తెలిసిందన్నారు. చేపలకు మేతగా కోళ్ళు వ్యర్థాలు, కోళ్ళు పెంట, కోళ్ళు ఎరువులు వేయడంతో దుర్వాసన వెదజల్లుతుందని స్థానికులు మాకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడిందని తెలిపారు.
ఈ విషయాన్ని అన్నం రెడ్డి నాగరాజును ప్రశ్నించగా దౌర్జన్యంగా మాట్లాడాడని, నీ చేతనైనది చేసుకోమని ఎదురు తిరిగాడని తెలిపారు. దినితో చేసేది లేక స్థానికుల సహాయంతో ఈ రోజు అనగా సోమవారం సాయంత్రం పోలీసులకు, తాశీల్ధార్ వారికి ఫిర్యాదు చేయడం జరిగిందని చెప్పారు. మా యందు దయ ఉంచి అక్రమంగా దౌర్జన్యంగా వ్యవహరిస్తున్న అన్నం రెడ్డి నాగరాజుపై చర్యలు తీసుకోవాలని పత్రిక ద్వారా అధికారులను కోరుతున్నారు.