ఏలూరు జిల్లా, జీలుగుమిల్లి: రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీని బలేపేతం చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పోలవరం టిడిపి ఇన్చార్జి బోరాగం శ్రీనివాసరావు అన్నారు. జీలుగుమిల్లి మండలంలోని జంగారెడ్డిగూడెం - హైదరాబాదు హైవే రోడ్డులోనిగల గన్నెమునేని కాంప్లెక్స్ లో స్వర్గీయ ఎన్టీ రామారావు కాంస్య విగ్రహాన్ని ఆయన ప్రారంభోత్సవం చేశారు.
గన్నమనేని కుమారులు టిడిపి పార్టీ కార్యాలయానికి గది ఇవడమే కాకుండా ఇదే ప్రాంగణంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం ఆదర్శంగా నిలుస్తారని ఈ సందర్భంగా వారిని కొనియాడారు. ప్రస్తుతం జీలుగుమిల్లి మండలంలో కొద్దిపాటి సమస్యలున్నప్పటికీ సర్దిపెట్టుకొని రానున్న రోజులలో పార్టీ కోసం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాబోయే రోజులలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుందని అందరికీ అవకాశాలు వస్తాయని ఆయన ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.
పదవుల కోసం ఎవరూ కూడా నిరాశ చందవలసన అవసరం లేదని పార్టీ మనుగడ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయవలసి ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జయవరపు శ్రీరామూర్తి, మాజీ ఎమ్మెల్యే మోడీ శ్రీనివాసరావు, మాజీ ఏఎంసీ చైర్మన్ పారేపల్లి రామారావు, మాజీ జెడ్పిటిసి రాజబాబు, కొర్లపాటి సునీల్, గనిమినేని బ్రదర్స్ కుడిపూడి చిరంజీవి తమ్మన సాంబశివరావు, తమన్న నాగేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ అభిమానులు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
జీలుగుమిల్లి టిడిపిలో బగ్గుమంటున్న వర్గ విబేధాలు
ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ గన్నమనేని పార్టీ కార్యాలయం ప్రారంభంలో బయట పడ్డ వర్గ పోరు.
ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో వర్గ పోరుతో కార్యకర్తల ఆందోళన నెలకొంది.
పార్టీ పెద్దలే మిగిలిన మండల పెద్దలకు కార్యక్రమం రద్దయిందని చెప్పడం ఆశ్చర్యం కలిగించింది.
ఓ వర్గం కావాలనే ఈ చర్యలకు పాల్పడుతున్నారని, మరో వర్గం ఆరోపణ చేస్తుంది.
ఏది ఏమైనా భారీగా ఏర్పాటు చేసిన కార్యక్రమం మధ్యస్థలం ఆగటం.. ఇష్టం లేక ఉన్న నలుగురే కార్యక్రమాన్ని జయప్రదం చేసి పార్టీకి గుర్తింపు తేవడానికి కృషి చేస్తున్నారని పలువురులో గుసగుసలు వినిపిస్తున్నాయి.