Hot Posts

6/recent/ticker-posts

ఏలూరు తరలి వెళుతున్న భాజపా శ్రేణులు


కాకినాడ జిల్లా, ఎర్రవరం: బీజేపీ కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో కాకినాడ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ ఆదేశాలతో 5 పార్లమెంట్ ల కార్యకర్తల క్లస్టర్ సమావేశానికి ప్రత్తిపాడు నియోజక వర్గం 5 మండలాల నుండి 300 మంది బీజేపీ శ్రేణులు ఈరోజు ఏలూరులో జరిగే కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ బహిరంగ సభ కు తరలి వెళుతున్నట్లు నియోజక వర్గ కన్వీనర్ ఘంటా బాలు దొర అన్నారు. 

ఈ కార్యక్రమానికి బూత్ కమిటీ అధ్యక్షులు, బి ఎల్ ఏ 2 బీజేపీ బాధ్యతలు వున్న కార్యకర్తలు, నాయకులు పాల్గొంటున్నట్లు జాతీయ కౌన్సిల్ సభ్యులు సింగిలిదేవి సత్తిరాజు తెలిపారు. ఎర్రవరం గ్రామం వేదికగా బిజెపి శ్రేణులు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించి బస్ లలో తరలి వెళ్ళడం జరిగింది. 

ఈ కార్యక్రమంలో కొల్లా శ్రీనివాస్, కంద వీరాస్వామి, కర్రి ధర్మరాజు, ఊట శ్రీను, గట్టిం వెంకట రమణ, కూరాకుల రాజా, రెడ్డి లోవరాజు, విస్తారక్, యార్లగడ్డ వెంకట్రాయుడు, రాతికింది కృష్ణారావు, ఈర్ల దేవి, గొల్లపూడి గణేష్, చక్రి, రెడ్డి వరలక్ష్మి, గున్నాబత్తుల రాజు బాబు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.