ఈ నెల 28వ తేదీన రాజమహేంద్రవరం, మార్గని ఎస్టేట్ లో 5 జిల్లాల రీజనల్ జాబ్ మేళా
జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి గంటా సుధాకర్
ఏలూరు: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, సీడాప్ మరియు జిల్లా ఉపాధి కార్యాలయం సంయుక్త అధ్వర్యంలో ఈ నెల 28వ తేదీ బుధవారం రాజమహేంద్రవరం, మార్గని ఎస్టేట్ లో 5 జిల్లాల రీజనల్ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి గంటా సుధాకర్ తెలిపారు.
ఏలూరు, పశ్చిమ, తూర్పు గోదావరి, డా.బి. ఆర్.అంబేద్కర్ కోనసీమ, కాకినాడ ఐదు జిల్లాలు కలిపి రాజమహేంద్రవరంలో రీజనల్ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు .
ఇతర వివరాలకు 9666322032, 9652503799 ను (9988853335 - టోల్ ఫ్రీ) ను లేదా https://tinyurl.com/ZONEII-RegionalJobMela వెబ్ సైట్ నందు రిజిస్టర్ కావాలని. ఈ జాబ్ మేళాకు హాజరు అయ్యే అభ్యర్ధులు తమ బయడేటా మరియు సర్టిఫికెట్స్ నకిలీతో హాజరు కావాలని తెలియజేసారు.