Hot Posts

6/recent/ticker-posts

ఆపరేషన్ హైదరాబాద్.. రేవంత్ దూకుడు


 పాలన మీద మరింత పట్టు సాధించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త ఆపరేషన్ ను షురూ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటి హైదరాబాద్ లో కీలకమైన నాలుగు అంశాల మీద ఫోకస్ చేశారు. ఎంత చెప్పినా తీరు మార్చుకోని అధికారులకు షాకుల మీద షాకులు ఇచ్చేందుకు వీలుగా ఈ కొత్త ఆపరేషన్ షురూ చేస్తున్నట్లుగాచెబుతున్నారు. 


గత ప్రభుత్వ హయాంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ వేలాది కోట్లు విలువైన భూములకు.. చెరువుల్ని చెరబట్టించిన వారికి చుక్కలు చూపించటంతో పాటు వారికి సహకరించిన అధికారులకు భారీ షాకులు ఇచ్చేందుకు రెఢీ అవుతున్నారు. 

తాజాగా నిర్వహించిన రివ్యూలో ఈ విషయాల్ని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. రాబోయే 15 రోజుల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన అధికారులపై దాడులు ఖాయమని.. వారిని ఇంటికి పంపేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లుగా తేల్చేశారు. ఓవైపు చర్యల కత్తికి పదును పెట్టటమే కాదు.. మరోవైపు హైదరాబాద్ రూపురేఖలు మార్చేందుకు అవకాశం ఉన్న అంశాలపై మరింత దూకుడు పెంచాలనిడిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా కొత్త మెట్రో మార్గాలకు త్వరలోనే శంకుస్థాపన కార్యక్రమాన్ని పెట్టుకోవాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాల్నిజారీ చేసినట్లుగా తెలుస్తోంది. 
 
అంతేకాదు.. హైదరాబాద్‌లో విలువైన ఆస్తుల జాబితా సమర్పించాలని జీహెచ్ఎంసీ.. హెచ్ ఎండీ వర్గాలను ఆదేశించటంతో పాటు.. మహానగరంలోని 3500 చెరువుల డేటా ఆన్ లైన్ నుంచి ఎందుకు తొలగిస్తున్నారు? అంటూ సూటి ప్రశ్నలతో అధికారులకు చెమటలు పట్టించారు. చెరువుల వద్ద సీసీ కెమేరాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అంతేకాదు.. హైదరాబాద్‌లో విలువైన ప్రభుత్వ ఆస్తుల జాబితాను సమర్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రారంభోత్సవాలను రానున్న వారంలో పెట్టుకోవాలని చెప్పారు. 

రాబోయే 15 రోజుల్లో హెచ్ఎండీ.. జీహెచ్ఎంసీల్లో విజిలెన్సు దాడులు జరుగుతాయని.. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన అధికారులు ఇంటికి వెళ్లటం ఖాయమని స్పష్టం చేయటం గమనార్హం. అంతేకాదు.. వాటర్ వర్క్స్ మీదా సీఎం ఫోకస్ చేవారు. ఆన్ లైన్ లో లేకుండా ఇచ్చిన అనుమతుల జాబితాను తయారు చేయాలని.. బిల్డింగ్ పర్మిషన్ల ఫైళ్లు క్లియర్ గా ఉండాల్సిందేనని చెప్పినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా చూస్తే.. హైదరాబాద్ రూపురేఖల్ని మార్చేందుకు.. ఏళ్లకు ఏళ్లుగా నగరానికి శాపంగా మారుతున్న అంశాలపై సీఎం రేవంత్ స్పెషల్ నజర్ వేసినట్లుగా తెలుస్తోంది.