Hot Posts

6/recent/ticker-posts

వికలాంగులకు 6000కు పెన్షన్ పెంచాలి: మహాజన సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర నేత విస్సంపల్లి సిద్ధు


ఏలూరు జిల్లా: ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వికలాంగులకు నెలకు రూ. 6,000 పెన్షన్ పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు మహాజన సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర నేత విస్సంపల్లి సిద్దు ప్రభుత్వాని డిమాండ్ చేశారు. 

బుధవారం ఆయన మాట్లాడుతూ వికలాంగుల హక్కుల సాధన కోసం మందకృష్ణ మాదిగ నాయకత్వంలో రూ. 200 పెన్షన్ నుంచి 3 వేల రూపాయలకు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. ఈనెల 20వ తేదీన గుంటూరు కేంద్రంగా జరిగిన వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కృష్ణ మాదిగ వికలాంగుల హక్కుల సాధన కోసం మార్చి 9న చలో అమరావతికి పిలుపునిచ్చారు. పక్క రాష్ట్రంలో వికలాంగులకు రూ. 6,000 పెన్షన్ సాధించిన ఘనత మంద కృష్ణ మాదిగకే దక్కుతుందని సిద్దు మహాజన్ అన్నారు. 

తెలంగాణ రాష్ట్రంలో వికలాంగులకు రూ. 6,000 పెన్షన్ ఇస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు ఇవ్వడం లేదని సిద్ధు మహాజన్ ప్రశ్నించారు. తెలంగాణలో ఇచ్చిన విధంగానే ఆంధ్రప్రదేశ్ లో ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్లో రూ. 6,000 పెన్షన్ కోసం హక్కుల సాధన కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వికలాంగుల అంతా “హలో వికలాంగు చలో అమరావతి” మార్చి 9 జయప్రదం చేయవలసిందిగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహాజన సోషలిస్టు పార్టీ ఏలూరు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తదితరులు పాల్గొన్నారు.