ఏలూరు: రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల ప్రకారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.పురుషోత్తం కుమార్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనము నందు కార్యదర్శి కె .రత్న ప్రసాద్ మరియు పర్మినెంట్ లోక్ అదాలత్ చైర్పర్సన్ శ్రీమతి ఎ.మేరీ గ్రేస్ కుమారి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్న ప్రసాద్ మాట్లాడుతూ మార్చి 9వ తేదీన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని, ఈ జాతీయ లోక్ అదాలత్ నందు రాజీయోగ్యమైన అన్ని క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, వాహన ప్రమాద బీమా కేసులు, ఆర్బిట్రేషన్ ఓపీలు, చిట్ ఫండ్ కేసులు, బ్యాంకు లావాదేవీలు, కుటుంబ తగాదాలు తదితర కేసులను రాజీ చేయడం జరుగుతుందని తెలియజేశారు.
జాతీయ లోక్ పదాలతో నందు 2059 కేసులను పరిష్కరించి రాష్ట్రంలో ఐదవ స్థానంలో నిలిచామని అలాగే ఈ జాతీయ ఒక్కదాలకు నందు ₹7,000 కేసులను రాజీయోగ్యమైన కేసులుగా గుర్తించడం జరిగిందని కావున కక్షిదారులు ఈ అవకాశానికి ఉపయోగించుకుని కేసుల నుండి విముక్తి కాగలరని సూచించారు. పర్మినెంట్ లోక్ అదాలత్ చైర్ పర్సన్ ఎ. మేరీ గ్రేస్ కుమారి మాట్లాడుతూ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ప్రతిరోజు రాజీయోగ్యమైన కేసులలో ప్రీ సిట్టింగ్ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని, రాజీ పడదలుచుకున్న కక్షిదారులు నేరుగా కానీ, న్యాయవాది ద్వారా కానీ తమ యొక్క కేసుల వివరాలను సంబంధిత కోర్టులకు కానీ లేదా పర్మినెంట్ లోక్ అదాలత్ గాని సంప్రదించవలెనని, ఈ కేసులకు మధ్యవర్తిత్వం నిర్వహించి ఇరుపక్షాలకు సమౌచితమైన రాజీమార్గం ద్వారా కేసుల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని, అలాగే చెక్ బౌన్స్ కేసులలో ఒకేసారి చెల్లించుకోలేని కక్షిదారులకు రెండు లేదా మూడు వాయిదాల చెల్లించే విధంగా కేసుల పరిష్కారం నిర్వహిస్తున్నామని తెలియజేశారు.
అలాగే ఈ కేసుల మధ్యవర్తిత్వానికి హాజరుకాలేని దూర ప్రాంతాల్లో నివసిస్తున్న కక్ష దారులు ఆన్లైన్ మార్గం ద్వారా కూడా కేసుల పరిష్కారానికి కృషి చేస్థున్నామని తెలియజేశారు. కావున న్యాయవాదులు కక్షిదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని రాబోయే నేషనల్ లోక్ అదాలత్ నందు కేసుల పరిష్కారానికి కృషి చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు.