Hot Posts

6/recent/ticker-posts

ఏలూరు జిల్లా ఖ్యాతి నిలబెట్టిన క్రీడాకారులను అభినందించిన జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న్ వెంకటేష్


ఇండోర్ స్టేడియంలో షటిల్ బ్యాడ్మింటెన్ కోర్టు అభివృద్ధికి చర్యలు.... 


ఏలూరు: ఏలూరు ఇండోర్ స్టేడియంలో షటిల్ బ్యాడ్మింటెన్ కోర్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయలు విడుదల చేయనున్నదని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ చెప్పారు. ఆడుదాం-ఆంధ్ర క్రీడా టోర్నమెంట్ లో క్రికెట్, బ్యాడ్మింటెన్ పోటిల్లో ప్రధమస్ధానం పొందిన విజేతలను స్ధానిక గోదావరి సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సత్కరించి అభినందించారు. 

జిల్లా బ్యాడ్మింటెన్ లో ఆడుదాం ఆంధ్రా రాష్ట్ర స్థాయి పోటిలో ప్రధమ స్ధానం పొందడం అభినందనీయమని ,ఈ విషయంపై రాష్ట్ర స్పోర్ట్స్ కార్యదర్శితో తాము సంప్రదించగా ఇండోర్ స్టేడియంలో కూలిపోయిన బ్యాడ్మింటెన్ కోర్టు తిరిగి పునరుద్ధరణకు కోటి రూపాయలు మంజూరు చేస్తున్నట్లు వారు తెలిపారన్నారు. దీనికి అధనంగా జిల్లాస్ధాయిలో మరిన్ని నిధులు సమకూర్చి బ్యాడ్మింటెన్ కోర్టు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు.  అదే విధంగా మనజిల్లా క్రీడాకారులు ఆడిన క్రికెట్ టోర్నమెంట్ ను స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిలకించి ప్రత్యేకంగా అభినందించారన్నారు. 

ఈ టోర్నమెంట్ లో పాల్గొన్న  క్రికెటర్ ఐపిఎల్ కు ఎంపిక కావడం మరింత అభినందనీయమన్నారు. క్రికెట్ టోర్నమెంట్ లో మొదటిస్ధానం పొంది రూ. 5 లక్షలు, బ్యాడ్మింటెన్ లో మొదటి స్ధానం పొంది రూ. 3 లక్షలు, నగదుతోపాటు విజేతలు షీల్డ్, కప్ లను పొందడం అభినందనీయమన్నారు.  అదే విధంగా బ్యాడ్మింటెన్ క్రీడాకారుడు వంశీకృష్ణరాజు ఉత్తమ క్రీడాకారుడిగా ఎంపికకావడం అభినందనీయమన్నారు. 
కార్యక్రమంలో కార్పొరేటర్ కలవకొల్లు సాంబ,ఐటిడిఎ పివో యం. సూర్యతేజ,  జిల్లా రెవిన్యూ అధికారి డి. పుష్పమణి, డిపిఓ తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్, డిఎస్ డిఓ బి. శ్రీనివాసరావు, పలువురు క్రీడా కోచ్ లు, పిఇటిలు, క్రీడాకారులు పాల్గొన్నారు.