ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ పి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. గణతంత్ర దినోత్సవం అంటే రాజ్యాంగం అమలులోకి వచ్చి ప్రజలు తమనుతామే పరిపాలించుకొనే సార్వభౌమ సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ఆవిష్కరించబడిన రోజు అని అన్నారు. దీనికి కృషి చేసిన మహానుభావుడు డా.బి ఆర్ అంబేద్కర్ అని అన్నారు. గణతంత్రం అనగా గణం అంటే ప్రజలు తంత్రం అంటే పరిపాలన, ప్రజలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా తమనుతామే పరిపాలించుకోవడానికి అవసరమైన నియమావళి అనగా రాజ్యాంగాన్ని ఆమోదించి, అమలులోకి వచ్చిన సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే మహోన్నతమైన రోజు అని అన్నారు.
ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్, రాజ్యాంగ రచనా కమిటీ సభ్యులు, రాజ్యాంగాన్ని ఆమోదించిన 287 మంది పెద్దలనీ, వారందరికీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఘన నివాళులు అర్పించారు
కొల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జాతీయ పతాకం యొక్క విశిష్టతను తెలియజేస్తూ, భారతదేశ ఖ్యాతి మరింత ఇనుమడించేలా ప్రతీ ఒక్కరూ భాద్యతతో, రాజ్యాంగం పట్ల విధేయతతో మెలగాలని అన్నారు. విద్యార్థి విద్యార్థులు చక్కని జాతీయ గీతాలను ఆలపించారు.
ఈ కార్యక్రమంలో ఎం వెంకటేశ్వరరావు, రాకేష్, జి వెంకటరమణ, గంగావతి, శ్రీనివాసరావు, రామారావు, విశ్వ కనకం సాగర్, నాగరాజు, నూకరాజు, సరోజినీ దేవి, బేబీ సప్రియ, నారాయణరావు, నాగేశ్వరావు, సారధి, విజయ్ కుమార్, నాగమణి, రామచంద్రరావు వెంకటేశ్వర్లు, బుల్ రాజు, కళాశాల అధ్యాపకులు, ఆఫీస్ సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.