Hot Posts

6/recent/ticker-posts

అంగన్వాడీల విజయోత్సవ సభ


 ఏలూరు జిల్లా, చింతలపూడి: 42 రోజుల సమ్మెలో సాధించిన విజయాలకు గుర్తుగా ఏపీ అంగన్వాడి వర్కర్స్ & హెల్పర్స్ యూనియన్ సిఐటియు చింతలపూడి ఐసిడిఎస్ ప్రాజెక్ట  చింతలపూడి మండల కమిటీ ఆధ్వర్యంలో అంగన్వాడీలు పెద్ద ఎత్తున విజయోత్సవ సభ జరుపుకున్నారు.


అంగన్వాడీలకు 42 రోజుల సమ్మె ఉద్యమంలో ఆర్థికంగా, హార్దికంగా సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ విజయోత్సవ సభ రుణపడి ఉంటుందని ప్రాజెక్ట్ అధ్యక్ష కార్యదర్శులు p. సరోజిని, T.మాణిక్యం కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా సిఐటియు మండల అధ్యక్షులు నత్త వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అంగన్వాడీ ఐక్యమత్య పోరాటమే వారిని విజయపదం వైపు నడిపించిందని, మొక్కవోని దీక్షతో ప్రభుత్వం ఎన్ని వేధింపులకు గురిచేసిన తమ డిమాండ్లు సాధించుకునే వరకు పోరాడారని ఈ సమ్మె ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుందని అన్నారు.


ఈ కార్యక్రమంలో మానవతా చైర్మన్ A. అప్పారావు, మెప్మా ఆర్పీ నాయకురాలు A.ఝాన్సీ, ఆశ యూనియన్ నాయకురాలు హెచ్. సుందరి, ఐద్వా జిల్లా నాయకురాలు M.వరలక్ష్మి దేవి, N. అశోక్ , సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్వీఎస్ నారాయణ మాట్లాడారు. సమ్మె జరిగిన 42 రోజులు ఉద్యమంలో పాల్గొన్న ఆయమ్మ తులసికి శాలువా కప్పి బోకే అందించారు. 42 రోజులు సమ్మెను జయప్రదం చేసిన సెక్టార్ లీడర్లకు G. సరళ ముగింపు ఉపన్యాసంలో అభినందించారు.


రిపోర్టర్

టీ. బాలస్వామి

చింతలపూడి

పశ్చిమ వాహిని

WhatsApp "𝙋𝘼𝙎𝘾𝙃𝙄𝙈𝘼 𝙑𝘼𝙃𝙄𝙉𝙄" Group Join Now
Telegram Group Join Now