కబడ్డి, ఖొ ఖొ, క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మెంటెన్ క్రీడాంశంలో పురుషులు, మహిళల జట్లు పోటీపడుతున్నాయి. 10 రోజల పాటు సాగే ఈ పోటీల్లో విజయం సాదించిన ప్రదమ జట్టుకు రూ 35 వేలు, ద్వితీయస్దానం జట్టుకు 15 వేలు, తృతీయస్దానం జట్టుకు రూ 5 వేలు అందించనుంది. నియోజకవర్గస్దాయిలో గెలుపొందిన జట్లు జిల్లా స్దాయికి చేరుకుంటాయని జిల్లా క్రీడాధికారులు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఏలూరు నియోజకవర్గ స్థాయి పోటీల ప్రత్యేక అధికారి జిల్లా గృహ నిర్మాణ శాఖ పీడీ కె. రవికుమార్, ఏలూరు నగర పాలక సంస్థ కమీషనర్ ఎస్. వెంకట కృష్ణ, డి ఎస్ డి ఓ శ్రీనివాసరావు, ప్రభృతులు పాల్గొన్నారు.