Hot Posts

6/recent/ticker-posts

అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చారిత్రాత్మకం: సర్పంచ్ గుణ్ణం రాంబాబు..


 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్  అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం విజయవాడలో ఏర్పాటు చేస్తుండటం చారిత్రాత్మకంగా నిలుస్తుందని గుమ్మిలేరు గ్రామ సర్పంచ్ గుణ్ణం రాంబాబు కొనియాడారు. 


విజయవాడలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్మృతి వనం మరియు 125 అడుగుల కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం సందర్భంగా నిర్వహించనున్న సామాజిక సమతా సంకల్పం సభకు సంఘీభావంగా ఆలమూరు మండలంలోని 18 గ్రామాల్లో గల 24 గ్రామ సచివాలయాల ఆవరణము నందు పలువురు గ్రామ సర్పంచుల ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. దీనిలో భాగంగా సామాజిక సమతా సంకల్పం సభకు మద్దతుగా సంతకాల సేకరణ నిర్వహించారు.


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడ నగరంలో నడిబొడ్డున విగ్రహం ఏర్పాటు చేస్తూ జగన్ తీసుకున్న నిర్ణయం అభినందనీయం అన్నారు. అంబేద్కర్ సిధ్దాంతాలను, ఆశయాలను, లక్ష్యాలను ముఖ్యమంత్రి సామాజిక న్యాయం ద్వారా అమలు చేస్తున్నారన్నారు. ఎస్సీ,ఎస్టీ, బీసీ మైనార్టీలకు పదవులను ఇవ్వడంతోపాటు క్యాబినెట్ లో అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రికి దక్కుతోందన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, సచివాలయం సిబ్బంది, ఏఎన్ఎం,ఆశ వర్కర్లు, వాలంటీర్లు పాల్గొన్నారు.