Hot Posts

6/recent/ticker-posts

మానవ సేవే-మాధవ సేవా: బొప్పన రాదమ్మ


 ఏలూరు జిల్లా : చింతలపూడి ప్రతీ కుటుంబానికి అండగా ఉంటామని చింతలపూడి నియోజకవర్గ ఎస్సి సెల్ అధ్యక్షులు పల్లి శ్రీను అన్నారు.

కామవరపుకోట మండల అధ్యక్షులు కిలారు సత్యనారాయణ ఆదేశాల మేరకు కళ్లచెరువులో వికలాంగుడైన చెన్నూరి శ్రీనివాసరావుకు బొప్పన రాదమ్మ వారి ఆర్ధిక సహాయంతో ట్రై సైకిల్ అందించటం జరిగింది. అనంతరం ఇంటింటికి భవిష్యత్ కు గ్యారెంటీ-మన చంద్రన్న అనే కార్యక్రమంలో పాల్గొని జనసేన-టీడీపీ కూటమితో ఇచ్చే సంక్షేమ పధకాలను తెలియ చెయ్యటం జరిగింది.

ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు రాజులపాటి లక్ష్మినారాయణ,TNSF సభ్యులు చెలికాని కిరణ్ బాబు, సీనియర్ నాయకులు మల్లారెడ్డి పెదబాబు, చౌటపల్లి అంజిబాబు, నాగరాజు పొద్దుటూరు యేసు. సత్యనారాయణ, ఎర్రా వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.


రిపోర్టర్

టీ. బాలస్వామి

చింతలపూడి