ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ, ఏలూరు జిల్లా ప్రభుత్వం యంత్రాంగం, హిందూ యువజన సంఘం (వైఎంహెచ్ఎ) సంయుక్త ఆధ్వర్యంలో స్ధానిక వైఎంహెచ్ఎ హాలులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్ పర్సన్ పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈ సంక్రాంతి సంబరాల్లో జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ తెలుగువారి సంస్కృతి, సాంప్రదాయాలకు నిలువుటద్దంగా కుటుంబ సమేతంగా కలిసి చేసుకునే ప్రత్యేకమైన సంక్రాంతి పండుగను నూతన సంవత్సరంలో మొదటి పండుగగా మూడు రోజులపాటు ఆనందోత్సహాలతో జరిగించుకోవడం ఆచారంగా కొనసాగుతుందని తెలిపారు.
ఈ సంక్రాంతి పండుగ ద్వారా కుటుంబ వ్యవస్ధ బలపడటమే కాకుండా నేటి సమాజంలో యువతకు సంస్కృతి సాంప్రదాయాలపై మక్కువనుకూడా పెంచడానికి ఈ పండుగ దోహదం చేస్తుందని అన్నారు. సంక్రాంతి పండుగ ఏలూరులో రాష్ట్ర తెలుగు సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో జరిపించడం ఆనందదాయకమని ఈ సందర్బంగా ప్రజలందరికి సంక్రాంతి శుబాకాంక్షలు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి పాల్గొని భోగి, సంక్రాంతి, కనుమ మూడు రోజుల పండుగ ఆనందోత్సాహాలతో ప్రజలందరూ ప్రతి సంవత్సరం జరిపించుకోవడం జరుగుతుందని ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ పండుగ జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ పండుగ యొక్క ముఖ్యఉద్ధేశ్యం భోగి భాగ్యం, సంక్రాంతి సంపద, కనుమ కలకాలం ఉండాలనే సదుద్ధేశ్యంతో సంక్రాంతి పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవడం ఎంతో ఆనందానిస్తుందని ఈ సందర్బంగా ఏలూరులో సంక్రాంతి ముందుగానే సంక్రాంతి సంబరాలు కార్యక్రమంలో పాల్గొనడం తనకెంతో ఆనందానిచ్చిందని ప్రజలందరుకు సంక్రాంతి శుబాకాంక్షలు తెలిపారు.
రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్ పర్సన్ పిల్లంగోళ్ల శ్రీలక్ష్మీ మాట్లాడుతూ సంక్రాంతి సంబరాల ఉత్సవాల్లో పాల్గొన్న అధికారులకు, కార్పోరేటర్లకు, కళాకారులకు సంక్రాంతి శుబాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ తెలుగు వారి సంస్కృతిక సంప్రదాయాలను ఆచరిస్తూ ప్రతి ఒక్కరికి మార్గదర్శకులు అవ్వాలని ఆమె కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్, రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్ పర్సన్ శ్రీలక్ష్మి, జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి, జెడ్పి చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఏలూరు ఆర్డిఓ ఎన్.ఎస్.కె. ఖాజావలి, మార్కెట్ యార్డు చైర్మన్ నెరుసు చిరంజీవులు, ఈడా చైర్మన్ బొద్ధాని శ్రీనివాసరావు, నగర డిప్యూటీ మేయర్లు ఎన్.సుధీర్ బాబు, జి. శ్రీనివాస్, నగరపాలక సంస్ధ కమీషనరు ఎస్. వెంకటకృష్ణ, సెట్ వెల్ సిఇఓ మెహరాజ్, నాట్యచార్య కేవివి సత్యనారాయణ, నగరపాలక సంస్ధ కార్పోరేటర్లతో సంక్రాంతి సంబరాలు సందర్బంగా ఏర్పాటు చేసిన భోగి మంటను, గంగిరెద్దులు, హరిదాసులు, సంక్రాంతి ముగ్గులు, గాలిపటాలు, తెలుగు సంప్రదాయ దుస్తులు ధరించిన బాలలు, కోలాటం, తదితర కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి చేతులమీదుగా 10 మందికి విశిష్ట సాహిత్య పురస్కారాల కింద రూ. 10 వేల నగదుతో జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి, సాహిత్య అకాడమీ చైర్ పర్సన్ శ్రీలక్ష్మితో సన్మానించి మెమెంటోను అందజేశారు.
ఈ కార్యక్రమంలో కూచిపూడి భరత నాట్య ప్రదర్శన కళాకారులు, కవులు, సాహిత్యవేత్తలు, వివిధ కళారూపాల కళాకారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.