ఉద్యోగుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఎం శ్రీదేవి
రాజమండ్రి: రాష్ట్ర వ్యాప్తంగా వివో ఏ మూడు సంవత్సరాల కాల పరిమితి 64 జీవోలు సర్కులర్ రద్దు చేయాలని ఉద్యోగ భద్రత కల్పించాలని లేకుంటే తప్పని పరిస్థితిలో సమ్మెలోకి వెళ్తామని ఆంధ్రప్రదేశ్ ఆర్పీలు యానిమేటర్ సంఘం ఉమ్మడి జిల్లా గౌరవ అధ్యక్షులు ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మధు పిలుపునిచ్చారు.
మంగళవారం మధ్యాహ్నం స్థానిక గ్రౌండ్ లో జిల్లా విస్తృతస్థాయి సమావేశం యూనియన్ అధ్యక్షురాలు ఎం శ్రీదేవి అధ్యక్షతన జరిగింది.
ముందుగా ప్రభుత్వం చేపడుతున్న విధానాలను యూనియన్ ప్రధాన కార్యదర్శి వరలక్ష్మి ప్రవేశపెట్టారు. భవిష్యత్తు కర్తవ్యాలను యూనియన్ కోశాధికారి కనక ఆమోదించారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న తాటిపాక మధు, ఎం శ్రీదేవి మాట్లాడుతూ ఎలాంటి వేతనాలు లేకుండా ఏళ్ల తరబడి సంఘాల ఏర్పాటుకు అభివృద్ధికి రాత్రి పగలు శ్రమ చేసిన మూడు సంవత్సరాల కాలపరిమితి విధించి తొలగించాలని నిర్ణయించడం అన్యాయం అన్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ పేదరికం పేదరికంని నిర్మూలించాలి కానీ యానిమేటర్ లను నిర్మూలించాలని కోవడం అన్యాయం అన్నారు. వివో ఏ ల మెడ్జ్ చేయడం వలన వేలాది మంది వివోఏలకు ఉపాధి పోతుందని ఉపాధికి నష్టం లేకుండా ఎక్కువ సంఘాలు ఉన్న తక్కువ సంఘాల ఉన్న సర్దుబాటు చేయాలని ఎటువంటి రాజకీయ జోక్యం ఉండకూడదని వారు కోరారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విఒఎ మీద కనికరం చూపి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. 10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలన్నారు. సీనియర్ యానిమేటర్ లకు ప్రమోషన్లు కల్పించాలన్నారు. ప్రతి నెల జీతం వ్యక్తిగత ఎకౌంట్లో వెయ్యాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం 25000 ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు .
ఈ సమావేశంలో యూనియన్ జిల్లా నాయకురాలు లలిత, ఈశ్వరి, లక్ష్మి, ఉమ్మడి జిల్లా నుండి వివిధ మండలాలు నుండి తదితరులు ప్రసంగించారు.