ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంబంధిత డాక్టర్ల అనుమతితోనే పరీక్షలు నిర్వహించాలని పరీక్ష వివరాలను బయటకు వెలువరించరాదని, చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడిన వైద్య పరీక్షా కేంద్రాల పైన, హాస్పటల్ పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటారని. నేటి సమాజంలో భ్రూణ హత్యలు పెరిగినవని శిశువు ఆడ, మగ తెలుసుకుని పితృస్వామ్య వారసత్వ చట్టాలు మరియు సాంస్కృతిక పద్ధతుల కారణంగా సాంప్రదాయకంగా ఆడపిల్లల కంటే మగ పిల్లలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది, మగ బిడ్డ పుట్టే వరకు కుటుంబాల పిల్లల్ని కలిగి ఉండటం కొనసాగించడానికి దారితీసింది, ఆడ శిశువులను వధించడం జరుగుతుందని క్రమంగా సమాజంలో స్త్రీల సంఖ్య తగ్గిపోతుంది వీటిని నివారించడానికి చట్టాన్ని రూపొందించారని తెలియజేశారు.
వైద్య పరీక్షా కేంద్రాలు ఎటువంటి ఒత్తిడిలకు తలవంచకుండా చట్టప్రకారం నడుచుకోవాలని, అలాగే ప్రతి పరీక్ష కేంద్రం నందు ఈ చట్టం యొక్క విధివిధానాల ప్రదర్శించే బోర్డును తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. మరియు కార్యక్రమంలో జిల్లా వినియోగదారుల ఫారం కమిషన్ మెంబర్ కె ఎస్ నాగలక్ష్మి, డిప్యూటీ డెమో నాగరత్నం, ప్యానల్ లాయర్ జీవి భాస్కర్ జిల్లాలోని రేడియాలజిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు తదితరులు పాల్గొన్నారు.