చింతలపూడి మండలంలో పలు కార్య క్రమాల్లో సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్ ఇండియా అంబేద్కర్ మిషన్ అధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించిన వాలీబాల్, కబడ్డీ పోటీలను గ్రేస్ మైదానంలో ఆయన ప్రారంభించారు. యువత క్రీడల పట్ల ఆసక్తి చూపాలని, అప్పుడే శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు అని ఆకాంక్షించారు.
పర్యటనలో భాగంగా స్థానిక నందమూరి కాలనీలో ఉన్న డా.అంబేద్కర్ భవన పునః నిర్మాణ పనులును పర్యవేక్షించారు. అనంతరం ఇటీవల కాలం చేసిన దళిత ఉద్యమ నాయకుడు బండి ఆశీర్వాదం కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎయిమ్ ప్రెసిడెంట్ వాసే ఆనంద్, సెక్రటరీ పి. రాంబాబు, జిల్లా. కో.కన్వీనర్. గొందిరాజు, ఎయిమ్ నాయకులు కాకర్ల సత్యం, NS రాజేంద్రకుమార్, Kబుచ్చిబాబు, క్రీడా పోటీల ఆర్గనైజర్ రజనీ, కె.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుండి క్రీడాకారులు క్రీడా పోటీల్లో పాల్గొన్నగా పియి టి లు పి. వేణు, ఎండీ.యూసుఫ్ లు పోటీల్లో న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.
రిపోర్టర్
టీ. బాలస్వామి
చింతలపూడి
పశ్చిమవాహిని