Hot Posts

6/recent/ticker-posts

భిక్షాటన ద్వారా నిరసన వ్యక్తం చేసిన మున్సిపల్ కార్మికులు


 ఏలూరు జిల్లా: చింతలపూడి మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ జేఏసీ పిలుపులో భాగంగా చింతలపూడి పట్టణంలో మున్సిపల్ కార్మికులు భిక్షాటన చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తొర్లపాటి బాబు మాట్లాడుతూ గత ఏడు రోజులుగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరతనట్లు ఉందని అన్నారు. సమస్యల పరిష్కారం కోసం చర్చలకుపిలుస్తూ కాలయాపన చేస్తుందని విమర్శించారు. 


కనీసం ఒక్క రూపాయి జీతం పెంచకుండా అటు నాది ఇటునాది అటుగా 21 వేల జీతం ఇస్తానని చెప్పడం సరికాదని అన్నారు. ఇప్పటికే మున్సిపల్ కార్మికులకు 15000 జీతం 6000 హెల్త్ అలవెన్స్ కలిపి 21 వేల జీతం వస్తుందని ఇందులో ఈ ప్రభుత్వం పెంచింది ఏమిటనే ప్రశ్నించారు. కనీస వేతనం 26,000 ఇచ్చే అంతవరకు సమ్మె కొనసాగిస్తామని తెలిపారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మొండి నిద్ర వీడకపోతే అవసరమైతే అన్ని కార్మిక సంఘాల రాజకీయ పక్షాలను కలుపుకొని రాష్ట్ర బంద్ నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.


ఈ భిక్షాటనని టిడిపి నియోజకవర్గ నాయకులు మారుమూడు థామస్  ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు వెలగాడ అనురాధ, వడిత్య బాలు, శ్రీరామ వెంకటయ్య, శ్రీరామ్ కోటయ్య, వెలగాడి రాము, పొదిలి చిన్నయ్య, పొదిలి మార్తమ్మ, మానుకొండ సర్వేశ్వరరావు, శ్రీరామ్ కృష్ణ, గంధం రాజేష్, మరిదాసు తదితరులు పాల్గొన్నారు.


రిపోర్టర్

టీ. బాలస్వామి

చింతలపూడి

WhatsApp "𝙋𝘼𝙎𝘾𝙃𝙄𝙈𝘼 𝙑𝘼𝙃𝙄𝙉𝙄" Group Join Now
Telegram Group Join Now