ఉండి: విద్యార్థుల్లో పోటీ తత్వాన్ని నింపి ప్రతిభను వెలికి తీసేందుకే తమ విజయలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నగదు ప్రోత్సాహకాలను గత కొన్ని సంవత్సరాలుగా అందిస్తున్నట్లు చైర్మన్ నల్లా సత్య కిరణ్ కృష్ణ ప్రసాద్ అన్నారు. మంగళవారం ఉండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు రామలక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన 77 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు పురస్కారం, మూడవ తరగతి నుండి 5వ తరగతి వరకు చదువుకునే విద్యార్థులకు, ఇంటర్మీడియట్ విద్యార్థులకు వారికి అవసరమైన పుస్తక సామాగ్రి మొత్తం సుమారు 80 వేల రూపాయలు వ్యయంతో విద్యార్థులకు విజయలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అందజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న జడ్పిటిసి రణస్థుల కనకదుర్గ మహంకాళి, ఎంపీపీ ఇందుకూరి శ్రీహరి నారాయణరాజు, గ్రామ సర్పంచ్ కమతం సౌజన్య బెనర్జీ మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థుల్లోని ప్రతిభను వెలికి తీసేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆణిముత్యాలు కార్యక్రమాన్ని ప్రారంభించారని 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదివిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు ముందుకొచ్చిన దాత విజయలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కు అభినందనలు తెలిపారు. కరోనా సమయంలో కూడా విజయలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ మండలంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు ట్రస్ట్ చైర్మన్ తెలిపారు. ప్రతి విద్యార్థి పోటీతత్వంతో చదివి వచ్చే సంవత్సరం మరింత మంది విద్యార్థులు ప్రోత్సాహకాలను అందుకునేందుకు సిద్ధంగా ఉండాలని ట్రస్ట్ చైర్మన్ విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నల్లా వెంకట కుమారి, యలమర్తి శ్రీనివాసాచారి, గజపతిరాజు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
*Watsapp* *BCN న్యూస్ 1
https://chat.whatsapp.com/By3GX74wWmN5qnPvK5KWn6
*Watsapp* *BCN న్యూస్ 2
https://chat.whatsapp.com/DtUL6ACZMV5EM8GvnrvVEB
*Watsapp* *BCN న్యూస్ 3
https://chat.whatsapp.com/LB98YbHDYwYBbTNbjkdkrL
*Watsapp* *BCN న్యూస్ 4
https://chat.whatsapp.com/KoB73o83HzJ15a5L8W9cN8
*Watsapp* *BCN న్యూస్ 5
https://chat.whatsapp.com/Gzxianew8kgCTAylGy2hg2
Public groups ఎవరైనా ఈ గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు. మరొకరిని జాయిన్ చేయవచ్చు. ఇందులో ఏదైనా ఒక గ్రూప్ లోనే జాయిన్ అవ్వండి..
BCN OTT