భూమికోసం సమర శంఖారావం పాదయాత్ర ముగింపు, జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయం వద్ద వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా
జంగారెడ్డిగూడెం: రాష్ట్ర ప్రభుత్వం అసైన్డ్ భూములు పొందిన పేదలకు యాజమాన్యపు హక్కులు కల్పిస్తూ 9/77 చట్టాన్ని సవరణ చేయడం దుర్మార్గమని వ్యవసాయం రాష్ట్ర అధ్యక్షులు దడాల్ సుబ్బారావు విమర్శించారు మంగళవారం నాడు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో స్థానిక సుందరయ్య కార్యాలయం నుండి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అసైన్మెంట్ భూముల ఆర్డినెన్స్ సవరణల నిర్ణయం వల్ల అసైన్డ్ దారుల కంటే అక్రమంగా, దౌర్జన్యంగా అనుభవిస్తున్న భూస్వాములే ఎక్కువ ప్రయోజనం పొందే అవకాశం ఉందన్నారు.
గతంలో కూడా అసైన్డ్ చట్ట సవరణ వల్ల పేదలకంటే అనర్హలే ఎక్కువ లబ్ధి పొందినారనే ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అసైన్డ్ లబ్ధి దారుల లిస్టులను గ్రామ సచివాలయంలో బహిరంగ పరచాలని కోరారు. అందులో అర్హులు అయిన వారికే యాజమాన్యపు హక్కుని కల్పించాలన్నారు. అక్రమంగా అనుభవిస్తున్న వారిపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 17,21,160 కుటుంబాలకు చెందిన 27,41,609 ఎకరాల అసైన్డ్ భూముల వివరాలు ప్రతి గ్రామ సచివాలయంలో బహిరంగ పరచాలని కోరారు. అనర్హుల చేతుల్లో ఉన్న భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని తిరిగి హక్కు దారులకు లేదా వారి వారసులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం భూ కొనుగోలు పథకం క్రింద భూమి కొని గ్రామంలో భూమి లేని పేదలకు పంచాలన్నారు. కోనేరు రంగారావు భూ కమిటి సిఫార్సుల మేరకు భూసీలింగ్ భూములతో పాటు పేదలకు పంచడానికి అవకాశమున్న అన్ని రకాల భూములను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
భూసమస్యలలో పోలీసుల జోక్యం ఉండకూడదన్నారు. పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించే పేదల పైన అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు రాష్ట్ర ప్రభుత్వం పునరా ఆలోచన చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం మరింత ఉద్యమం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు *అనంతరం సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం.జీవరత్నం, పి రామకృష్ణ మాట్లాడుతూ* భూ శంఖారావం పాదయాత్ర సందర్భంగా రెండు మండలాల్లో సుమారు 20 గ్రామాలలో యాత్రలో పేదలు అనేక సమస్యలు తెలిపారు. యాత్ర బృందానికి వ్యక్తిగతంగా వారి సమస్యలతో కూడిన పిటిషన్లు అందజేశారు. యాత్ర సందర్భంగా వచ్చిన 10 రకాల భూ సమస్యలను యాత్ర బృందం తరఫున ఆర్ డి ఓ ఏవో కి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా జీవరత్నం, రామకృష్ణ మాట్లాడుతూ టీ నర్సాపురం మండలం అల్లూరి సీతారామరాజు నగర్ ఇళ్లస్థలాలు సమస్యలు పరిష్కరించాలన్నారు. రామమ్మగూడెం భూ సమస్య మరియు బచ్చులేటిగూడెం అటవీ భూ సమస్యలు పరిష్కరించడంలో మండల రెవెన్యూ అటవీ శాఖ అధికారులు వైఫల్యం చెందారని మండిపడ్డారు. అనేకమార్లు సమస్యలు అధికారులు దృష్టిలో పెట్టిన ఎక్కడ వేసిన గొంగళి అక్కడ అన్నట్లు వ్యవహరించాలని ఆవేదన వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం, కేతవరం, చక్రదేవరపల్లి, గురవాయిగూడెం గ్రామాల్లో ఉన్న ల్యాండ్ సీలింగ్ భూములను ఆక్రమించుకున్న భూస్వాముల నుండి భూమి స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ భూముల కోసం పేదలు దళితులు దశాబ్దాల తరబడి పోరాడుతున్న రెవెన్యూ శాఖ అధికారులకు చెవిటోది ముందు శంఖం ఊదినట్లుగా ఉందన్నారు. రెవెన్యూ అధికారుల కను సన్నల్లో భూ రికార్డులు అవకతవకలు జరుగుతున్నాయని మండిపడ్డారు. రెండు మండలలాల తాహశీల్దార్ లు రికార్డులు తారుమారు చేయడంలో కీలకపాత్ర పోషిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రీసర్వే పేరుతో భూములను భూస్వాములకు కట్టబెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎర్రకాలువ మిగులు భూములు పేదల సాగుకు అవకాశం కల్పిస్తూ ఎక్ సాల్ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మిగల భూములలో పశుపోషణకు, వ్యవసాయానికి పేదల ఉపయోగించుకుంటుంటే వాటికి పట్టాలు ఇవ్వకపోగా పోలీసులతో నిర్బంధించి అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఇరిగేషన్ భూముల్లో పోలీసుల దౌర్జన్యం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం పేదల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించాలని దళిత, గిరిజన పేదలకు భూములు పంచాలని కోరారు.
2013 భూ సేకరణ చట్టాన్ని ప్రగడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కోనే రంగారావు భూ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. *ఈ కార్యక్రమంలో మద్దతుగా కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి అందుగుల ఫ్రాన్సిస్ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జి సూర్య కిరణ్ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి తామా ముత్యాలమ్మ జిల్లా కమిటీ సభ్యులు మడకం సుధారాణి ఏ.ప్రభాకర్ తదితరులు మాట్లాడారు.* అనంతరం ఏఓకి వినతిపత్రం అందజేసిన సందర్భంగా ఆయన పెదలు తెలియజేసిన సమస్యలను ఆర్డీవో దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. *ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రాజమండ్రి దానియేలు, యాగంటి సీత, రామలక్ష్మి, దుర్గ, రుక్మిణి, కే సుబ్బారావు, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.
*Watsapp* *BCN న్యూస్ 1
https://chat.whatsapp.com/By3GX74wWmN5qnPvK5KWn6
*Watsapp* *BCN న్యూస్ 2
https://chat.whatsapp.com/DtUL6ACZMV5EM8GvnrvVEB
*Watsapp* *BCN న్యూస్ 3
https://chat.whatsapp.com/LB98YbHDYwYBbTNbjkdkrL
*Watsapp* *BCN న్యూస్ 4
https://chat.whatsapp.com/KoB73o83HzJ15a5L8W9cN8
*Watsapp* *BCN న్యూస్ 5
https://chat.whatsapp.com/Gzxianew8kgCTAylGy2hg2
Public groups ఎవరైనా ఈ గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు. మరొకరిని జాయిన్ చేయవచ్చు. ఇందులో ఏదైనా ఒక గ్రూప్ లోనే జాయిన్ అవ్వండి..