తాజా వార్తలు

10/recent/ticker-posts

రాష్ట్రంలోనే తొలిసారిగా ఏలూరులో సేంద్రియ ఆహార ఉత్పత్తులు మెగా మేళా ఏర్పాటు రైతులకు శుభపరిణామం.


సేంద్రియ ఆహార అలవాట్లును చేసుకుని మనమంతా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, పకృతి వ్యవసాయ రైతులకు అండగా నిలవాలి. 
80 మంది ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తి రైతులు, 180 వివిధ రకాలు ఉత్పత్తులు,50 స్టాల్స్ ఏర్పాట్లు.
సేంద్రియ ఆహార ఉత్పత్తులు తొలిరోజు మెగా మేళాను జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి లాంఛనంగా ప్రారంభించారు. 
జిల్లా కలెక్టరుతో పాటు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, డిసియంయస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ (చిన్న) పాల్గొన్నారు.


ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రియల్ 18: స్థానిక డిసియంయస్ ఫంక్షన్ హాలులో శనివారం రాష్ట్రంలోనే మొదటగా సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులు తొలిరోజు మెగా మేళాను జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి లాంఛనంగా ప్రారంభించారు. జిల్లా కలెక్టరుతో పాటు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, డిసియంయస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ (చిన్న) పాల్గొన్నారు. వ్యవసాయ అనుబంధ శాఖలు   80 మంది ఆర్గానిక్ వ్యవసాయ రైతులు, 180 రకాలు ఉత్పత్తులు, 50 స్టాల్స్ ను  పరిశీలించి, రైతులు, డ్వాక్రా మహిళలు, వినియోగ దారులతో మాట్లాడారు. దేశీయ బియ్యం 8 రకాలు ఉంచిన రథచక్రాన్ని పరిశీలించారు. సెల్ఫీ పాయింటు దగ్గర జిల్లా కలెక్టరు సెల్ఫీ ఫోటో దిగారు.
 
ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ  జిల్లా వ్యవసాయ అనుబంధ శాఖలు అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించినప్పుడు, జిల్లాలో ఆర్గానిక్ వ్యవసాయ రైతులు ఉత్పత్తులతో మెగా మేళా నిర్వహించాలని ఆలోచన వచ్చిందని అన్నారు. ఈ రోజు అందరి సహకారంతో ఆర్గానిక్ మెగా మేళాను ప్రారంభించుకోవడం నాకు ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని కలిగిందని అన్నారు. రాష్ట్రానికి ఆదాయంతో పాటు రైతులకు కూడా ఆదాయం పెరగాలని, ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తులను ప్రజలు వినియోగించుకుని మంచి ఆరోగ్యంతో ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచన ఈ రోజు కార్యరూపం దాల్చిందని అన్నారు. 

ఏలూరు జిల్లా ఆర్గానిక్ వ్యవసాయ రైతులు ఉత్పత్తులను ప్రోత్సహించి, వారికి అండగా ఉండవలసిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు.సేంద్రియ మరియు సహజ వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించడం మెగా మేళా యొక్క ప్రధాన ఉద్దేశ్యమని అన్నారు. రైతులకు నేరుగా వినియోగదారులతో సంబంధం కల్పించడం మరియు ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారంపై అవగాహన కల్పించడం అన్నారు. సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించాలని, రైతులు ఉత్పత్తులను నేరుగా వినియోగ దారులకు విక్రయించే వేదిక అన్నారు. ఏలూరు పట్టణ ప్రజలు అందరూ ఆహ్వానితులేనని అన్నారు. వివిధ శాఖలు  అధికారులు, ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులను, బంధువులను, స్నేహితులను ఈ మెగా మేళాకు తీసుకురావాలని, తమకు నచ్చినవి కొనుగోలు చేసుకుని రైతులకు భరోసానిద్దామని అన్నారు.

దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి ప్రోత్సాహంతో ఆర్గానిక్ వ్యవసాయ రైతులు ఉత్పత్తులు మెగా మేళాను రాష్ట్రంలోనే తొలిసారిగా మన జిల్లాలో ప్రారంభించుకోవడం శుభదినం అన్నారు. జిల్లాలో మొక్కజొన్న రైతులు చాలా నష్టపోతున్నారని అతి తక్కువ ధరలకే దళారులు కొనుగోలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి మొక్కజొన్నకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టరును కోరారు. 

ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తులు వలన మనకు ఆరోగ్యాన్ని ఇవ్వటమే కాకుండా క్యాన్సర్ రోగాన్ని దూరం చేస్తుందని అన్నారు. తొలకరి జల్లు నాటికి రైతులకు, ఉద్యోగులకు, ప్రజలకు సబ్సిడీపై ఆకు, కూరగాయలు విత్తనాలను అందించాలని సూచించారు. వారికి ఉన్న కొద్దిపాటి స్థలంలో గాని బిల్డింగులు పైన గాని ఆకు, కూరగాయలు పండించుకుంటారని, దీని వలన చక్కని ఆరోగ్యం, డబ్బు ఆదా, మనకు ఎంతో సంతృప్తి కలుగుతుందని అన్నారు. 

ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తులు ప్రజలు వినియోగించు కునేలా,  రైతులు ప్రోత్సహించడం కోసం మెగా మేళా రెండు రోజులు ఏర్పాటు చేసుకునుట అభినందనీయమని అన్నారు. మంచి కార్యక్రమంలో నేనుకూడ పాల్గొనడం నాకు ఎంతగానో సంతోషం కలిగిందని అన్నారు. ఇటువంటి కార్యక్రమం  మన జిల్లాలో ఏర్పాటు చేసుకునుట రాష్ట్రానికే ఏలూరు జిల్లా ఆదర్శంగా ఉందని అన్నారు. రానున్న కాలంలో జిల్లాలో ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తులు మరింత ప్రోత్సహించి, ఆరోగ్య ఏలూరు జిల్లాగా కలిసికట్టుగా కృషిచేద్దామని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ జేడి యస్.కె.హమీబ్ భాషా, ఏపి యంఐపి పిడి డా.యస్. రామ్మోహన్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి కె.షాజా నాయక్, డిఆర్డిఏ పిడి టి.వి.విజయలక్ష్మీ, పకృతి వ్యవసాయ జిల్లా మేనేజరు బి.వెంకటేష్, మెప్మా పిడి యం.రాజబాబు, డిసివో అరిమిల్లి శ్రీనివాస రావు, ఏపీ ఎన్జీవోస్ జిల్లా ప్రెసిడెంటు చోడగిరి శ్రీనివాసరావు, ఏయంసి చైర్మన్లు మామిళ్ళపల్లి పార్థసారథి, గారపాటి రామ సీత, తహశీల్దారు కె.గాయత్రీ దేవి, బిఆర్ సి అసోసియేషన్ కన్వీనరు బి.జె.కె. మురళీధర్, వివిధ శాఖలు అధికారులు, ఉద్యోగులు, పట్టణ ప్రముఖులు, ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తులు రైతులు, వినియోగదారులు, పట్టణ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.