జలధార-జలహారతి కార్యక్రమంలో ప్రజలు, రైతులు భాగస్వాములు కావాలి.
పార చేతబట్టి మట్టిపూడికను తీసి, మట్టితట్టలను స్వయంగా ఉపాధిహామీ శ్రామికులకు అందించి అందరికీ జోష్ నింపిన జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి ...
ఏలూరు/దెందులూరు, పశ్చిమ వాహిని, ఏప్రియల్ 18: దెందులూరు మండలం గాలాయిగూడెం గ్రామంలో శనివారం జలధార-జలహారతి కార్యక్రమంలో భాగంగా రూ 4 లక్షలు 21 వేల రూపాయలు వ్యయంతో బాబుగారు చెరువు నుండి వెంకయ్యపుంత వరకు ఒక కిలోమీటరు ఫీడర్ ఛానల్ తవ్వకాలు పనులను పరిశీలించి, పారచేతబట్టి మట్టిపూడికను తీసి, మట్టితట్టలను స్వయంగా ఉపాధిహామీ శ్రామికులకు అందజేస్తూ, సుమారు 90 నిమిషాలు జలధార - జలహారతి కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు, రైతులకు, ఉపాధి హామీ శ్రామికులకు జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి జోష్ నింపారు.
జాతీయ ఉపాధిహామీ శ్రామికులతో జిల్లా కలెక్టరు నమేకమయ్యి, రోజుకి రూ 307 రూపాయలు తగ్గకుండా పనిచేసుకోవాలని, సమస్యలు ఏమైనా ఉన్నాయా అని జిల్లా కలెక్టరు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అందరితో కలిసి గ్రూపు ఫోటో దిగారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ రాష్ట్రంలో భూగర్భజలాలను పెంచడం, నీటి భద్రతను బలోపేతం చేయడం మరియు ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జలధార-జలహారతి కార్యక్రమం అన్నారు. 100 రోజులు యాక్షన్ ప్లాన్ ద్వారా ఉపాధి హామీ నిధులను అనుసంధానిస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో పైప్డ్ వాటర్ సప్లైపై దృష్టి సారిస్తుందని అన్నారు.
జిల్లా వ్యాప్తంగా భూగర్భజలాలు మట్టాన్ని పెంచడం మరియు గ్రామాలలో పైపులు ద్వారా సురక్షిత తాగునీరు అందించడం ముఖ్య ఉద్దేశమని అన్నారు. యాక్షన్ ప్లాన్ అమలు, దీనిలో భాగంగా చెరువులు, చెక్‌డ్యాంలు మరమ్మతులు, వర్షపునీటి నిల్వలుపై ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నారు. దీనికి ప్రజలు, రైతులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఉపాధి హామీ పథకం నిధులతో ఈ కార్యక్రమాన్ని అనుసంధానించామని, దీనిని ఒక ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకువెళ్ళాలని అన్నారు.
జలవనరులు సంరక్షణతో పాటు, గ్రామాల్లో తాగునీటి ఎద్దడిని నివారించడం దీని ప్రధాన ఉద్దేశ్యమని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా జలవనరులను పెంచి, భవిష్యత్తు తరాలకు నీటి భద్రత కల్పించాలన్నది ప్రభుత్వ ఆలోచన అని అన్నారు. జిల్లాలో జలధార కార్యక్రమం కింద నీటిపరిరక్షణ పనులను నిర్దేశించిన సమయంలోగా పూర్తిచెయ్యాలని అన్నారు. మండల, గ్రామాలు వారీగా చెరువులలో నీటి నిల్వ సామర్ధ్యం పెంచేందుకు ఫీడర్ చానెల్స్, చెరువులు చేపట్టవలసిన పనులు కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుని, నిర్దేశించిన సమయంలోగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలన్నారు.
పనులు నాణ్యతకు నాణ్యతా బృందాలతో తనిఖీలు నిర్వహించటం జరుగుతుందని, నాణ్యతలో లోపాలు గుర్తిస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఉపాధిహామీ శ్రామికులకు చల్లటి రక్షిత మంచినీటిని, భోజన సమయంలో నీడనిచ్చే పందిర్లు, అన్నిరకాలు మందులతో మరియు ఓఆర్ఎస్ ప్యాకెట్స్ తో ఉచిత వైద్యశిబిరాన్ని ఏర్పాటు చెయ్యాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో తహశీల్దారు బి.సుమతి, యంపిడివో కె.వీరప్రతాప్, ఏపీవో పి.ఫాతిమా ప్రసన్న, ఇంజనీరింగు కన్సల్టెంటు జి.దుర్గాప్రసాదు, ఫీల్డు, డిజిటల్, టెక్నికల్ అసిస్టెంట్లు, గ్రామ నాయకులు, రైతులు, స్థానిక ప్రజలు, జాతీయ ఉపాధి హామీ శ్రామికులు, తదితరులు పాల్గొన్నారు.


