తాజా వార్తలు

10/recent/ticker-posts

“పోలీసుల ఒత్తిడికి చెక్… ఏలూరులో మొదలైన ఈ ప్రత్యేక కార్యక్రమం ఏమిటి?”


ఏలూరు, పశ్చిమ వాహిణి, ఏప్రిల్ 13: పోలీసు సిబ్బందిలో శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపర్చేందుకు ఏలూరు జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ ఆదేశాల మేరకు సోమవారం ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం పరిధిలోని పోలీస్ పరేడ్ మైదానంలో సామూహిక యోగాసనాల సాధన కార్యక్రమం నిర్వహించారు.


ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ జీ. ముని రాజా పాల్గొని యోగా ప్రాముఖ్యతను వివరించారు. యోగా కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాకుండా మానసిక ప్రశాంతత, ఒత్తిడి నియంత్రణకు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. నిత్యం విధుల్లో ఒత్తిడికి లోనయ్యే పోలీసు సిబ్బందికి యోగా సాధన ఎంతో మేలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుత కాలంలో యోగా ప్రాధాన్యత మరింత పెరిగిందని, ప్రపంచవ్యాప్తంగా దీనిని ఆచరిస్తున్నారని చెప్పారు. యోగా సాధన ద్వారా ఒత్తిడి, ఆందోళనల నుంచి ఉపశమనం లభించి, ప్రతి ఒక్కరూ మానసికంగా, శారీరకంగా దృఢంగా మారుతారని ఆయన వివరించారు.

జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా యోగా ప్రాముఖ్యతను సిబ్బందిలో విస్తృతంగా చాటి చెప్పాలని, ఎస్పీ ఆదేశాల మేరకు మరింత ప్రోత్సహించనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ పవన్ కుమార్, ఆర్‌ఎస్‌ఐలు భాస్కరరావు, సత్యనారాయణ, వెంకటేష్ తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.