తాజా వార్తలు

10/recent/ticker-posts

రైతన్నలు భూములకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలు రక్షణ కవచంలా నిలుస్తుంది - రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి


ఏలూరు/చాట్రాయి, పశ్చిమ వాహిని, ఏప్రియల్ 08: చాట్రాయి మండలం బూరుగుగూడెం గ్రామంలో బుధవారం రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర గృహనిర్మాణ సమాచార పౌరసంబంధాలు మంత్రి కొలుసు పార్థసారథి ముఖ్య అతిథిగా పాల్గొని, 492 మంది రైతులకు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. మిగిలిన 272 పాసు పుస్తకాలు త్వరితగతిన పంపిణీకి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతులు యోగక్షేమాలను, ఏఏ పంటలు వేశారు దిగుబడి ఏలా వచ్చిందని తదితర వివరాలను మంత్రి కొలుసు పార్థసారథి అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ రైతులు భూహక్కులు పరిరక్షణకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందని, అందుకు అనుగుణంగా సర్వేపూర్తి అయిన ప్రతి రైతుకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని అన్నారు. భూరికార్డులు మార్పు చేసేందుకు వీలు లేకుండా ఆధునిక పరిజ్ఞానంతో డిజిటలైజేషన్ పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీకి అన్ని చర్యలు తీసుకున్నామని అన్నారు. రైతులు, ప్రజలు హక్కులను గౌరవిస్తూ వారికి భరోసా కల్పించడమే సుపరిపాలన ప్రధమ లక్ష్యమని అన్నారు. 

పట్టాదారు పాసుపుస్తకాలలో డేటా అంతా చాలా స్పష్టంగా, తప్పులు లేకుండా ఉండాలని, తప్పులు ఉంటే తీసుకోవద్దని సరిచేసి గ్రామ సభలు అందజేస్తామని అన్నారు. రెండవసారి కూడా తప్పులతో అందజేస్తే సంబంధిత అధికారులను బాధ్యులు చేస్తామని అన్నారు. భూరికార్డులను ఎవరూ మార్పు చేసేందుకు వీలులేకుండా ఆధునిక పరిజ్ఞానంతో డిజిటలైజేషన్ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని, దీనికి రైతులు సహకారం ఎంతో అవసరమని మంత్రి పేర్కొన్నారు. 

గత ప్రభుత్వం తప్పిదాలను సరిచేస్తూ రైతులకు భద్రత కల్పిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రెవిన్యూ, భూ సమస్యలను నిర్దిష్టమైన సమయంలోగా పరిష్కరించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించడం జరిగిందన్నారు. రైతులు, ప్రజలు ఆకాంక్షలకు అనుగుణంగా  హక్కులను గౌరవిస్తూ భరోసా కల్పించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలతో తప్పులు లేని పట్టాదారు పాసుపుస్తకాలను అందించే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. 

మీ పిల్లలకు ఉజ్వల భవిష్యత్తును అందించే పాలనను ముఖ్యమంత్రి అందిస్తున్నారన్నారు. పేదవారు రూపాయి, రూపాయి దాచుకుని కొనుకున్న భూములుపై వారికి పూర్తి హక్కులు కల్పించేదిశగా పట్టాదారు పాసుపుస్తకాలుతో రక్షణగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టిందన్నారు. గతంలో నిర్వహించిన రీసర్వేలో జరిగిన తప్పులను ప్రస్తుత ప్రభుత్వం సరిచేసి రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలను రైతులందరికీ అందజేస్తున్నామని అన్నారు. వాటిలో చిన్నపాటి సవరణలు, మార్పులు అవసరమైనచో సచివాలయములో డిజిటల్ అసిస్టెంటు వద్ద ధరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. 

ఈ సందర్భంగా పట్టాదారు పాసు పుస్తకంలో గల క్యూఆర్ కోడ్ లను వివరిస్తూ వాటిని స్కాన్ చేసినట్లయితే పట్టాదారు వివరములు,  భూమి వివరాలు విస్తీర్ణం, స్కెచ్ మరియు రూటు మ్యాప్, శాటిలైట్ ఇమేజి కూడా చూసుకొనవచ్చునని మంత్రి రైతులకు వివరించారు.

ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టరు బొల్లిపల్లి వినూత్న, తహశీల్దారు జి.బద్రు, యంపిడివో బి.రాజు, మండల అధికారులు, గ్రామ సచివాలయం, రెవిన్యూ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు, మండల, గ్రామ నాయకులు, రైతులు, స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.