తాజా వార్తలు

10/recent/ticker-posts

గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజల ఆరోగ్యం సురక్షితం: ఎమ్మెల్యే రోషన్ కుమార్


ఫాతిమాపురంలో “స్వచ్ఛ పథకం” ఘన ప్రారంభం


చింతలపూడి, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 29: గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజల ఆరోగ్యం సురక్షితంగా ఉంటుందని శాసనసభ్యులు రోషన్ కుమార్ పేర్కొన్నారు.

ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఫాతిమాపురం గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “స్వచ్ఛ పథకం” కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, సంఘాల సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా, తడి-పొడి చెత్తను వేర్వేరుగా నిర్వహించాలని సూచించారు. డ్రైనేజీ వ్యవస్థను సక్రమంగా నిర్వహించడం ద్వారా వ్యాధులను నివారించవచ్చని తెలిపారు.

అలాగే స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛ రథాన్ని ప్రారంభించారు. మండలంలోని క్లాప్ మిత్రలను ఒకచోట చేర్చి, ప్రతి బుధవారం ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

గ్రామాల్లో పారిశుధ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను చైతన్యపరచాలని, మొక్కలు నాటడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం వంటి చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.