తాజా వార్తలు

10/recent/ticker-posts

ముళ్ళపూడి బాపిరాజు ప్రమాణ స్వీకారాన్ని విజయవంతం చేయాలి


మంగళగిరిలో ఘనంగా కార్యక్రమం – భారీ ర్యాలీకి ఏర్పాట్లు


లింగపాలెం, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 28: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ముళ్ళపూడి బాపిరాజు ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని విజయవంతం చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రేపు (ఏప్రిల్ 29) ఉదయం ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈ ప్రమాణ స్వీకారం జరుగనుంది.

ఈ సందర్భంగా ఉదయం 9 గంటలకు కలపర్రు టోల్ గేట్ వద్ద నుంచి మంగళగిరి పార్టీ కార్యాలయం వరకు సుమారు 1000 కార్లతో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని లింగపాలెం మండల పార్టీ అధ్యక్షుడు గరిమళ్ల తలపతిరావు కోరారు.