జంగారెడ్డిగూడెం, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 15: జంగారెడ్డిగూడెంలో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠిన చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ ఎస్ఐ కుటుంబరావు మరియు వారి సిబ్బంది నిర్వహించిన తనిఖీలలో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 6 మందిపై కేసులు నమోదు చేశారు.
ఈ కేసులను కోర్టులో ప్రవేశపెట్టగా, గౌరవ మేజిస్ట్రేట్ పరిశీలించి ప్రతి ఒక్కరికి రూ.10,000 చొప్పున మొత్తం రూ.60,000 జరిమానా విధించారు.
జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ మరియు జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత ఆర్, ఐపీఎస్ ఆదేశాల మేరకు, ఇన్స్పెక్టర్ ఎం.వి. సుభాస్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నిబంధనల అమలులో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.
పోలీసుల హెచ్చరిక:
మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన శిక్షలు, భారీ జరిమానాలు తప్పవని పోలీసులు స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దని హెచ్చరించారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి తనిఖీలు కొనసాగుతాయని ట్రాఫిక్ ఎస్ఐ కుటుంబరావు తెలిపారు.


