నిజామాబాద్, పశ్చిమ వాహిని, ఏప్రిల్, 11: తెలంగాణ యూనివర్సిటీ బీసీ సెల్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే 199వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీసీ సెల్ డైరెక్టర్, యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఆరతి మాట్లాడుతూ ఫూలే గారి సేవలను స్మరించుకున్నారు. సమాజంలో ఉన్న అసమానతలను తొలగించడానికి విద్యే ప్రధాన ఆయుధమని నమ్మిన మహాత్మా జ్యోతిరావు ఫూలే సిద్ధాంతాలను విద్యార్థులు ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.
సత్యశోధక్ సమాజం స్థాపించి కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన ఫూలే గారు మహిళల విద్య, సామాజిక చైతన్యానికి విశేషంగా కృషి చేశారని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఫూలే గారి సామాజిక సేవలను కొనియాడారు.


