ఉంగుటూరు, పశ్చిమ వాహిని, మార్చి,27: ఏలూరు జిల్లా,ఉంగుటూరు నియోజకవర్గం, ఉంగుటూరు మండలం, బొమ్మిడి గ్రామం ఎస్సీ కాలనీలో ఉన్న రామాలయంలో గత 50 సంవత్సరాల నుండి శ్రీరామనవమి వేడుకలు అద్భుతంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ సంవత్సరం వేద సంకల్ప సేవా ట్రస్ట్ వారి ఆర్థిక సహకారంతో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి.
ఐదు జంటలు స్వామివారి కల్యాణంలో కూర్చుని నిర్వహించారు. వారికి వేద సంకల్ప ట్రస్ట్ మరియు దానధర్మసేవా ట్రస్ట్ సహకారంతో పట్టు వస్త్రాలు సమర్పించారు. అదేవిధంగా స్వామివారికి పూజా కైంకర్యాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు పానకం వడపప్పు పాయసం పులిహార ప్రసాదం అందించారు.
ఈ కార్యక్రమంలో ఉంగుటూరు బిజెపి అధ్యక్షులు వంజరపు దుర్గారావు, గ్రామస్తులు అనంతలక్ష్మి, శ్రీ చత్రపతి శివాజీ సేవా సంస్థ సభ్యులు మాకా శివయ్య, పెద్ది శెట్టి గంగాధరరావు, కొంపట్ల జానకి రామయ్య, తదితరులు పాల్గొన్నారు.


