తాజా వార్తలు

10/recent/ticker-posts

అయ్యవారి పోలవరంలో ఘణంగా శ్రీరామనవమి వేడుకలు


టి. నరసాపురం, పశ్చిమ వాహిని, మార్చి 27: ఏలూరు జిల్లా టి.నరసాపురం మండలంలోని అయ్యవారి పోలవరం గ్రామంలో శ్రీ సీతారామ చంద్ర స్వామి లక్ష్మణ ఆంజనేయ స్వామి వార్ల ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వేద పండితులు జటావల్లభుల త్రినాధమూర్తి వేదమంత్రోచ్ఛారణల మధ్య భక్తులు కొట్టే గోవిందరాజు ఆదినారాయణమ్మ దంపతులచే శ్రీ సీతారామ కళ్యాణం వైభవంగా జరిగింది.

ఈ సందర్భంగా వేద పండితులు జటావల్లభుల త్రినాధమూర్తి మాట్లాడుతూ.. ఈ వేడుకల సందర్భంగా శ్రీరామ తత్వం ద్వారా “అధికారానికి మించి బాధ్యత ముఖ్యమనే సందేశం”, సీతాదేవి తత్వం ద్వారా “కష్టసుఖాలలో సహజీవనం అవసరం”, లక్ష్మణుని ద్వారా “కుటుంబ బాధ్యతల పంచుకోవడం”, ఆంజనేయుని ద్వారా “నమ్మిన ధర్మం కోసం అంకితభావం” వంటి విలువలను భక్తులకు గుర్తు చేశారు.

అధిక సంఖ్యలో మహిళ భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదములు సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు నాదెండ్ల కృష్ణ, కొట్టే వీరభద్రరావు, కొట్టే పెనుగొండ, సత్యనారాయణ, చక్రధరరావు, వెంకటేశ్వరరావు, వెంకన్న బాబు, పసుపులేటి సత్యనారాయణమూర్తి, నానోజీ, పసుపులేటి శ్రీనివాసరావు, మాడిశెట్టి నారాయణరావు, కొట్టే కిషోర్ తదితరులు పాల్గొన్నారు.