ఏలూరు జిల్లా, టి. నరసాపురం, కే. జగ్గవరం, పశ్చిమ వాహిని మార్చి 28: తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన తెలుగుదేశం పార్టీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం ప్రతి కార్యకర్త బాధ్యత అని పార్టీ రాష్ట్ర కార్యదర్శి జయవరపు శ్రీరామమూర్తి అన్నారు.
ఆదివారం కే. జగ్గవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జయవరపు శ్రీరామమూర్తి పార్టీ జెండాను ఆవిష్కరించి, కేక్ కట్ చేసి కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు తెలుగు గర్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలనే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీని స్థాపించారని గుర్తుచేశారు. పార్టీ 44 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం ప్రతి కార్యకర్తకు గర్వకారణమని పేర్కొన్నారు.
పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లి, ప్రజల ఆశయాల సాధన కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బొందలపాటి సత్యనారాయణ, అద్దంకి రామారావు, జయవరపు శ్రీనివాసరావు, ఉప్పల వెంకటనారాయణ, డోలా రామయ్య, గంట బుచ్చిబాబు, పరస బాలరాజు, జోజి, అగ్నిపర్తి సాంబయ్య, బొందలపాటి శ్రీనివాసరావు, బొందలపాటి గోపాలకృష్ణ, భీమవరపు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


