-వివిధ ప్రాంతాల్లోని పలు రామాలయాల్లో జరిగిన శ్రీ రామ నవమి వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరైన రెడ్డి అప్పలనాయుడు గారు..
-కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లోను అభివృద్ధి సాధించింది..
-శ్రీరామ చంద్రుని దివ్య ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలి - రెడ్డి అప్పల నాయుడు ఆకాంక్ష..
ఏలూరు, పశ్చిమ వాహిని, మార్చి 27: ఏలూరు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పలు రామాలయాల్లో శుక్రవారం శ్రీరామనవమి మహోత్సవాలను ఘనంగా ప్రారంభించారు. ఏలూరు మార్కెట్ యార్డులో నిమ్మకాయల వర్తక సంఘం వారి ఆధ్వర్యంలో జరిగిన శ్రీ రామనవమి వేడుకల్లో, కొత్తూరు ఇందిరమ్మ కాలనీలో ఉన్న శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయంలో.. న్యూ ఫిష్ మార్కెట్ లో ఉన్న భక్తాంజనేయ స్వామి వారి దేవస్థానంలో.. కొమడవోలులో ఉన్న శ్రీరామాలయంలో.. రామానగర్ కాలనీలోని శ్రీ సువర్చలా సహిత శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం లో.. గానుగుల పేటలో శ్రీ షిర్డీ సాయిబాబా మరియు శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో.. కొత్తపేటలోని ఏటిగట్టు ప్రాంతంలో ఉన్న శ్రీ రామాలయంలో.. తూర్పు వీధిలోని ఓం నమః శివాయ శ్రీరామ మందిరంలో.. దక్షిణపు వీధిలోని పెద్దమ్మ అమ్మవారి దేవస్థానంలోని శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయంలో జరుగుతున్న శ్రీ సీతారాముల మహోత్సవానికి ఆయా కమిటీల ఆహ్వానం మేరకు ముఖ్యఅతిథిగా హాజరై శ్రీ సీతారామ స్వాముల వారిని దర్శించుకున్న ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి రెడ్డి అప్పలనాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పలు రామాలయాల్లో ఆలయ కమిటీ సభ్యుల పర్యవేక్షణలో, ఆలయ అర్చక స్వాముల ఆధ్వర్యంలో విశ్వక్సేన పూజ, శ్రీరామచంద్రుని పెండ్లి కుమారుడు చేయుట, పుణ్యాహవచనం, అంకురారోపణం, ధ్వజారోహణం వంటి పలు పూజ కార్యక్రమాలు వైఖానస సంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు.
ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ధర్మ స్వరూపుడైనా శ్రీరామచంద్రుడు, సత్యం, న్యాయం, కర్తవ్యం, నిష్ఠలకు ఆదర్శప్రాయుడన్నారు. ఆయన చూపిన మార్గంలోనే నడుచుకుంటూ, సమాజంలో శాంతి సౌహార్దాలను నెలకొల్పడం మనందరి బాధ్యతగా భావించాలి. ఆ శ్రీరామ చంద్ర స్వామి వారి దివ్యమైన ఆశీస్సులతో మన రాష్ట్రం అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో, యువ నాయకులు నారా లోకేష్ కృషితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లోను అభివృద్ధి పథంలో సాగుతుందన్నారు. ఈ పవిత్ర పర్వదినం ప్రతి ఇంటిలో ఆనందం, శాంతి, ఐశ్వర్యం నింపాలని, రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా, నగర అధ్యక్షులు వీరంకిపండు, నాయకులు సరిది రాజేష్, రెడ్డి గౌరీ శంకర్, ఎట్రించి ధర్మేంద్ర, బోండా రాము నాయుడు, బెజవాడ నాగభూషణం, జనసేన రవి, కొండల ప్రసాద్ మరియు వివిధ హోదాల్లో ఉన్న జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు, అర్చక స్వాములు, భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


