తాజా వార్తలు

10/recent/ticker-posts

శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి కళ్యాణంలో పాల్గొన్న జిల్లా అదనపు ఎస్పీ ఎన్. సూర్యచంద్రరావు, సతీమణి సూర్య భవాని దంపతులు


ఏలూరు పశ్చిమ వాహిని మార్చి 27: శ్రీరామ నవమి వేడుకలలో భాగంగా ఏలూరు అమీనా పేటలోని పోలీస్ క్వార్టర్ వద్ద గల పురాతన శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో జగదభిరాముడైన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించినారు.

ఈ పవిత్ర కళ్యాణ మహోత్సవంలో ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) ఎన్. సూర్య చంద్రరావు వారి సతీమణి సూర్య భవాని కలిసి పాల్గొన్నారు. వీరు స్వామివారి కళ్యాణంలో పీటల మీద కూర్చుని శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు, కళ్యాణాన్ని నిర్వహిం చారు. భక్తిశ్రద్ధలతో సీతా రాముల వార్లకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రా లను సమర్పించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య, మంగళ వాయిద్యాల మోతతో ఆధ్యాత్మిక వాతావరణంలో కళ్యాణ ఘట్టం కనుల పండువగా సాగింది.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ తోపాటు పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. లోక కల్యాణం కోసం, జిల్లా ప్రజలం దరూ ఆయురా రోగ్యాలతో, సుఖ శాంతులతో ఉండాలని ఆ సీతా రామచంద్రుని ప్రార్థించినట్లు అధికారులు తెలిపారు.

కళ్యాణం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ వారు అదనపు ఎస్పీ దంపతులను మరియు ఇతర అధికారులను ఘనంగా సత్కరించారు.

ఈ కళ్యాణ ఉత్సవానికి ఏలూరు డిఎస్పి డి శ్రావణ్ కుమార్ ఏ ఆర్ డీఎస్పీ చంద్ర శేఖర్, ఎస్ బి ఇన్స్పెక్టర్ మల్లేశ్వర రావు, కైకలూరు రూరల్ ఇన్స్పెక్టర్ వి రవికుమార్, ఆర్ ఐ లు పవన్ కుమార్, సతీష్, సిబ్బంది పాల్గొన్నారు.