హైదరాబాద్, పశ్చిమ వాహిని, మార్చి15: మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో పోలీసుల దర్యాప్తు జరుగుతోందని ఈగల్ ఎస్పీ గిరిధర్ తెలిపారు. డ్రగ్స్ తీసుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. డ్రగ్స్ పార్టీ సమాచారం తెలుసుకునే అక్కడికి వెళ్లామని చెప్పారు. డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న వారిలో 11 మందికి డ్రగ్స్ టెస్టులు చేశామని.. అందులో ఆరుగురికి పాజిటివ్ వచ్చిందని వెల్లడించారు. వారితో పాటు ఓ మహిళా ఉన్నట్లు గుర్తించామని.. వీరందరిని కోర్టు ఎదుట హాజరు పరుస్తామని పేర్కొన్నారు. తాము ఫామ్‌హౌస్ లోపలకు వెళ్లేటప్పుడే తుపాకీ కాల్పుల శబ్దాలు వచ్చాయని చెప్పుకొచ్చారు. ఈ పార్టీకి సిమ్లా నుంచి కొకైన్ తీసుకొచ్చినట్లు గుర్తించామని అన్నారు.
డ్రగ్స్ సేకరణపై విచారణ..
డ్రగ్స్ వాడకంపై కఠిన చర్యలు ఉంటాయని ఈగల్ ఎస్పీ గిరిధర్ హెచ్చరించారు. 14వ తేదీ సాయంత్రం నిషేధిత మత్తు పదార్థాలు తీసుకుంటున్నట్లు తమకు సమాచారం రావడంతో మొయినాబాద్ ఫామ్‌హౌస్‌పై రైడ్స్ చేశామని తెలిపారు. డ్రగ్స్ ఎక్కడ నుంచి తీసుకువచ్చారనే పూర్తి వివరాలు సేకరిస్తున్నామని అన్నారు. తెలంగాణను డ్రగ్స్ ఫ్రీగా చేయాలన్నదే ఈగల్ టీమ్ లక్ష్యమని.. ఆ విధంగా పనిచేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఈ పార్టీలో రెండు రకాల మత్తు పదార్థాలను ఉపయోగించారని తెలిపారు. గన్‌ఫైర్ గురించి ఆరా తీస్తున్నామని ఈగల్ ఎస్పీ గిరిధర్ పేర్కొన్నారు.



.jpeg)








