నూజివీడు మండలం, నామవరం, పశ్చిమవాహిని, మార్చి 09: నామవరం గ్రామంలో బంజారా భజరంగీ భేరి సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దల చేతుల మీదుగా శ్రామిక మహిళలకు చీరలను పంచిపెట్టారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భూక్యా వేణుగోపాల్ నాయక్ మాట్లాడుతూ ఇంటా బయటా అన్ని బాధ్యతలను సమర్థంగా నిర్వహించే శక్తి రూపమే స్త్రీమూర్తి అని అన్నారు. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు.
సంఘ ప్రధాన కార్యదర్శి భూక్యా కృష్ణ నాయక్ మాట్లాడుతూ ఆధునిక మహిళలు అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తూ ప్రపంచ చరిత్రను తిరగ రాస్తున్నారని అన్నారు. మహిళల సాధికారతతో సమాజం మరింత పురోగమిస్తుందని తెలిపారు.
సంఘ అధ్యక్షులు మూడు శ్రీనివాస నాయక్ మాట్లాడుతూ అవనిలో సగభాగం అయిన మహిళలకు చట్టసభల్లో సగం స్థానాలు కేటాయించాలని కోరారు. పాలనా పగ్గాలు మహిళల చేతుల్లోకి వచ్చినప్పుడు దేశం నిజమైన అభివృద్ధి సాధిస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో బోడా సర్వేశ్వరావు, భూక్యా నాగేశ్వరావు, బాణావతు నవీన్, బోడా గోపాలరావు, భూక్యా శ్రీరామమూర్తి తదితరులు పాల్గొన్నారు.








