కేఆర్ పురం, పశ్చిమవాహిని, మార్చి 16: అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా కేఆర్ పురం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిర్రి బాలరాజు హాజరై పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన మహనీయుడని పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకోసం ఆయన చేసిన ఆమరణ నిరాహార దీక్ష భారత దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని అన్నారు. సమాజంలో న్యాయం, సమానత్వం, ప్రజల హక్కుల కోసం ఆయన చేసిన త్యాగం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరిస్తూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో రాముల నాయక్, మండల అధ్యక్షులు మెట్ట బుచ్చిరాజు,భారతీయ జనతా పార్టీ రాష్ట్ర గిరిజన మోర్చా నాయకురాలు బొరగం వెంకటలక్ష్మి, గ్రీనరీ అండ్ బ్యూటీఫికేషన్ డైరెక్టర్ పాదం కృష్ణ, ఏఎంసీ వైస్ చైర్మన్ కొండేపాటి రామకృష్ణ, ఐటీడీఏ సిబ్బంది, కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.



.jpeg)








