తాజా వార్తలు

10/recent/ticker-posts

టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ


భీమడోలు, పశ్చిమ వాహిని, మార్చి 29: తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉంగుటూరు నియోజకవర్గం భీమడోలు మండలం పశ్చిమవాహినిలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా భీమడోలు గ్రామంలోని గాంధీ బొమ్మ సెంటర్‌లో పార్టీ జెండాను ఎగురవేసి, భీమడోలు పంచాయితీ కార్యాలయం వద్ద దాతల సహకారంతో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం సంతపేటలో ఉన్న నందమూరి తారక రామారావు విగ్రహానికి స్థానిక నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఏప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ, నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేదల సంక్షేమానికి కృషి చేసిన మహోన్నత నాయకుడని కొనియాడారు. చిత్ర పరిశ్రమలో నటసార్వభౌముడిగా పేరొందిన ఆయన, “శ్రీకృష్ణార్జున యుద్ధం” చిత్రంలో శ్రీకృష్ణుడి పాత్ర పోషణతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేశారని గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.