ఏలూరు, పశ్చిమ వాహిని, మార్చి 29: ఏలూరు జిల్లాలో పీఎంఏవై మరియు ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకాల కింద ఈ నెల 30వ తేదీన 1160 ఇళ్లకు సామూహిక గృహప్రవేశాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు.
జిల్లాలో ఈ పథకాల కింద మొత్తం 82,443 మంది పేదలకు ఇళ్లు మంజూరు చేయగా, వాటిలో ఇప్పటివరకు 45,089 ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. తాజాగా మరో 1160 ఇళ్ల నిర్మాణాలు పూర్తికావడంతో, వాటిని లబ్ధిదారులకు అందజేయనున్నట్లు తెలిపారు.
నియోజకవర్గాల వారీగా పూర్తైన ఇళ్ల వివరాలు ఇలా ఉన్నాయి:
* చింతలపూడి – 123
* దెందులూరు – 89
* ఏలూరు – 502
* గోపాలపురం – 12
* కైకలూరు – 172
* నూజివీడు – 119
* పోలవరం – 91
* ఉంగుటూరు – 52
ఈ గృహప్రవేశ కార్యక్రమాన్ని సోమవారం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పండుగ వాతావరణంలో నిర్వహించి, లబ్ధిదారులకు ఇళ్లు అందజేయనున్నట్లు కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు.


