దెందులూరు, పశ్చిమ వాహిని, మార్చి 29: దెందులూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని గ్రామ గ్రామాన టీడీపీ జెండాలు రెపరెపలాడుతూ పండుగ వాతావరణం నెలకొంది.
పెదపాడు మండలం అప్పన్నవీడు గ్రామంలో ఆదివారం నిర్వహించిన వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే, నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర చరిత్రలో చెరగని ముద్ర వేసిన మహానేత ఎన్టీఆర్ పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేసి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలు ప్రజాసేవకు అంకితం కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో దెందులూరు మార్కెట్ యార్డ్ చైర్‌పర్సన్ గారపాటి రామసీత, పెదపాడు మండల పార్టీ అధ్యక్షుడు మరడానీ రవి, క్లస్టర్ ఇన్‌చార్జ్ గుత్తా అనిల్ తదితర ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


