ఏలూరు/ముసునూరు, పశ్చిమ వాహిని, ఫిబ్రవరి 13: ముసునూరు మండలం బలివే శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ప్రక్కన శుక్రవారం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సభలో నియోజక వర్గస్థాయి ప్రజాధర్బార్ ను రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, సంబంధిత అధికారులతో కలసి నిర్వహించారు. ప్రజలు నుండి అర్జీలను స్వీకరించి, సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ ప్రజాధర్బార్ లో వచ్చిన అర్జీలు సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి, శాశ్వత పరిష్కారం చూపాలని, ప్రజా సమస్యలు పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.
ప్రజాపాలనలో ప్రజలు భాగస్వామ్యం చాలా అవసరం అని, ప్రజలతో నేరుగా మమేకమై సమస్యలు తెలుసుకోవడం ద్వారా వారికి సంతృప్తికరమైన పరిష్కారం జరుగుతుందని అన్నారు. అధికారులు అంతా సహకరించాలని, ఎప్పుటి కప్పుడు సమస్యలను పరిష్కరిస్తే అర్జీలు సంఖ్య తగ్గుతుందని అన్నారు. ప్రజా సమస్యలు పరిష్కారానికి రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు క్రమం తప్పకుండా ప్రజాధర్బార్ లు నిర్వహించడం ద్వారా రికార్డు స్థాయిలో సమస్యలు పరిష్కారం అవుతున్నాయని అన్నారు.
అపద,అత్యవసర సమయాల్లో ప్రవేటు వైద్యం చేయించుకున్న 12 మందికి నిరుపేదలకు రూ 6.35 లక్షలు చెక్కులు పంపిణీ: మంత్రి కొలుసు పార్థసారథి...
ముసునూరు మండలం బలివే శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం ప్రక్కన శుక్రవారం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సభలో అపద, అత్యవసర సమయాల్లో ప్రవేటు వైద్యం చేయించుకున్న 12 మందికి నిరుపేదలకు రూ 6.35 లక్షలు చెక్కులను మంత్రి కొలుసు పార్థసారథి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ నిరుపేద, మధ్యతరగతి వర్గాలకు వైద్య సాయంగా ముఖ్యమంత్రి సహాయనిధి ఆర్థిక భరోసాను కల్పిస్తుందని అన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానవత్వంతో పేదవర్గాలు వైద్యఖర్చులను అందజేసి, వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి సహాయ నిధిని పునరుద్ధరించి పెద్ద ఎత్తున సాయం అందిస్తూ ఆదుకుంటున్నామని తెలిపారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఏఒక్కరికి రూపాయి సాయం కూడా అందలేదన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతున్నాయని అటువంటి మంచి కూటమి ప్రభుత్వాన్ని అన్ని వర్గాలు ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, మండల ప్రముఖులు, కూటమి నాయకులు,లబ్ధిదారులు వారి కుటుంబ సభ్యులు, ఎక్కువ సంఖ్యలో అర్జీదారులు పాల్గొన్నారు.







