ఫైర్ బ్రాండ్ ముద్ర ఉన్న బలమైన నాయకుడికి చేతికి బీజేపీ తెలంగాణ రాష్ట్రశాఖ పగ్గాలు అందడం ఖాయంగా కనిపిస్తోంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మద్దతు పుష్కలంగా ఉన్న నాయకుల పేర్లను షార్ట్ లిస్ట్ చేసినట్లు చెబుతున్నారు. సామాజిక వర్గ సమీకరణాలను సైతం దీనికి ప్రాతిపదికగా తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం తెలంగాణ బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడి కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి కొనసాగుతున్నారు. ఆయన వారసుడిని పార్టీ ఎంపిక చేయాల్సి ఉంది. దీనికోసం సీనియర్ నేతల పేర్లను పరిశీలనలోకి తీసుకుంది. ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందర్ రావు, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు, చింతల రామచంద్రారెడ్డి, మురళీధర్ రావు పేర్లు వినిపిస్తోన్నాయి.
మహిళను పార్టీ అధ్యక్షురాలిగా చేయాలనుకుంటే మహబూబ్ నగర్ లోక్ సభ సభ్యురాలు డీకే అరుణకు ఆ అవకాశం దక్కుతుందని సమాచారం. రామచంద్ర రావుతో పాటు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్.. ఈ పదవి కోసం ఫ్రంట్ రన్నర్లుగా నిలిచారు. మహిళా నాయకత్వం వైపు మొగ్గు చూపితే డీకే అరుణను ఖరారు చేయవచ్చని అంటున్నారు.

అనుభవం ఉన్న వారికి పార్టీ పగ్గాలను ఇవ్వాలనుకుంటే ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు జీ కిషన్ రెడ్డిని కొనసాగించడం లేదా మళ్లీ బండి సంజయ్ కు ఆ హోదాను అప్పగించడం బీజేపీ అధిష్ఠానం ముందు ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలు. కిషన్ రెడ్డి అదే పదవిలో కొనసాగడానికి పెద్దగా ఇష్టపడట్లేదనే ప్రచారం ఉంది.
కొత్త వారిని ఎంపిక చేయాలనుకుంటే ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్, రాంచందర్ రావు లేదా డీకే అరుణల్లో ఒకరిని పార్టీ అధ్యక్ష పీఠం వరిస్తుంది. ఈ నలుగురిలో కూడా ఆర్ఎస్ఎస్ మద్దతు ఉన్న వారిని ఎంపిక చేయడానికే పార్టీ అగ్రనాయకత్వం మొగ్గు చూపుతుది. ఆ పరిస్థితే వస్తే ధర్మపురి అరవింద్, రాంచందర్ రావులల్లో ఒకరి పేరు ఖరారవుతుంది.

Shakir Babji Shaik
Editor | Amaravathi