తాజా వార్తలు

10/recent/ticker-posts

షేక్ ముస్తఫా తల్లి మృతి – కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యేలు, ప్రముఖులు


జంగారెడ్డి గూడెం, ఫిబ్రవరి, 22: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్, పట్టణ తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడు షేక్ ముస్తఫా తల్లి షేక్ సుఫియా బేగం ఇటీవల కన్నుమూశారు. ఆమె మృతి పట్ల ప్రాంతీయ ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.


ఈ సందర్భంగా చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ కొండ్రెడ్డి కిషోర్ షేక్ ముస్తఫా నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి తమ సానుభూతిని తెలియజేశారు. అలాగే మున్సిపల్ కమిషనర్ కె.వి. రమణతో పాటు పలువురు స్థానిక నాయకులు, సామాజిక ప్రముఖులు హాజరై కుటుంబ సభ్యులను ఓదార్చారు.

పరామర్శించిన వారిలో రావూరి కృష్ణ, అబ్బిన దత్తాత్రేయ, తోటికుంట దుర్గారావు, పరిమి సత్తిపండు, మాణికల సూరిబాబు, కోనేటి చంటి, తోటికుంట రాము, దాకారపు కృష్ణ, షేక్ యాకోబు, షేక్ నజీర్ భాష, మహమ్మద్ రఫీ, పొదిలి ఫణి శర్మ, పాకనాటి కాశి, కొండేటి నాగు, షేక్ అల్లావుద్దీన్, దాసరి అప్పారావు, కంకిపాటి సుబ్బారావు, మందపల్లి మాధవి, తానిగడప సుమలత తదితరులు ఉన్నారు.

షేక్ సుఫియా బేగం ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ముస్తఫా కుటుంబానికి ఈ దుఃఖాన్ని తట్టుకునే ధైర్యం ప్రసాదించాలని వారు ఆకాంక్షించారు.