తాజా వార్తలు

10/recent/ticker-posts

విధి నిర్వహణలో మృతి చెందిన హోం గార్డుల కుటుంబాలకు ఆర్థిక సహాయం – ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్


ఏలూరు, ఫిబ్రవరి 13: ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ గారు, విధి నిర్వహణలో అనారోగ్యంతో మృతి చెందిన హోం గార్డుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు. హోం గార్డ్ సిబ్బంది ఒక్క రోజు వేతనాల నుంచి సేకరించిన నిధులను దివంగత హోం గార్డుల కుటుంబాలకు చెక్కుల రూపంలో అందించారు. 

తాడేపల్లిగూడెం యూనిట్‌లో పనిచేసిన హెచ్‌.జి 305 పి. రాజేంద్ర కుమార్ గారు 11-09-2024న అనారోగ్యంతో మృతి చెందగా, వారి భార్య శ్రీమతి సాత్విక గారికి రూ. 5,17,590 చెక్కును అందజేశారు. ఏలూరు యూనిట్‌కు చెందిన హోం గార్డ్ 927 కె. సత్తి రాజు గారు 22-10-2024న అనారోగ్యంతో మరణించగా, వారి భార్య శ్రీమతి కె. అంబిక గారికి రూ. 5,20,430 చెక్కును అందించారు. 

ఈ సందర్భంగా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ మాట్లాడుతూ, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన లేదా అనారోగ్యంతో మృతి చెందిన హోం గార్డుల కుటుంబాలను ఆదుకోవడం తమ ప్రధాన బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. అలాంటి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడం గౌరవంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఆర్ ఆర్‌ఐ శ్రీ పవన్ కుమార్, ఆర్‌ఎస్‌ఐ శ్రీ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.