తాజా వార్తలు

10/recent/ticker-posts

“వేగం వద్దు – ప్రాణం ముద్దు”: కైకలూరులో హెల్మెట్ స్పెషల్ డ్రైవ్


ఏలూరు జిల్లా, పశ్చిమ వాహిని, ఫిబ్రవరి 13: రహదారి భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచే లక్ష్యంతో కైకలూరు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక హెల్మెట్ డ్రైవ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమం చేపట్టారు. కైకలూరు టౌన్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ ఆధ్వర్యంలో, టౌన్ ఎస్ఐ వెంకట కుమార్ మరియు పోలీస్ సిబ్బంది కలిసి వాహన తనిఖీలు నిర్వహించారు. 

ఈ తనిఖీల్లో హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వాహనదారులకు కేవలం జరిమానాలు విధించకుండా, తక్షణమే హెల్మెట్ కొనుగోలు చేయించి రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. “శిక్షల కంటే భద్రత ముఖ్యమని” పోలీసులు స్పష్టం చేశారు. డ్రైవ్ సందర్భంగా మైనర్లు వాహనాలు నడుపుతున్న ఘటనలను గుర్తించి, వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. భవిష్యత్తులో మళ్లీ మైనర్లు మోటార్ సైకిళ్లు నడిపితే, వారి తల్లిదండ్రులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ వెంకట కుమార్ హెచ్చరించారు. 

రహదారి ప్రమాదాల్లో ఎక్కువగా యువతే ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొంటూ, వేగానికి లోనవకుండా భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. “వేగం వద్దు – ప్రాణం ముద్దు” అనే సందేశాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేశారు.