తాజా వార్తలు

10/recent/ticker-posts

నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలి - ఏలూరులో సార్వత్రిక సమ్మె ఘనంగా


ఏలూరు, పశ్చిమ వాహిని, ఫిబ్రవరి 12: కేంద్ర ప్రభుత్వం 2026 ఏప్రిల్ 1 నుండి అమలు చేయనున్న నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, జిరాంజి పథకాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఏలూరు నగరంలో సార్వత్రిక సమ్మె ఘనంగా జరిగింది. ఏలూరు కార్పొరేషన్ కార్యాలయం వద్ద ప్రారంభమైన ర్యాలీలో ఏఐటీయూసీ (AITUC), ఐఎఫ్టీయూ (IFTU) సహా వివిధ ఉద్యోగ, కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ప్రదర్శన పాత బస్టాండ్ వంతెన, జీఎన్‌టి రోడ్డు, పవర్‌పేట రైల్వే స్టేషన్ రోడ్డు, ఆర్‌ఆర్‌పేట మీదుగా ఎన్టీఆర్ పార్క్ వరకు సాగింది. ర్యాలీలో కళాకారుల నృత్యాలు, విచిత్ర వేషధారణలు, నాలుగు లేబర్ కోడ్లు కార్మికులకు ఉరితాళ్లుగా మారుతున్నాయని చూపించే ప్రతీకాత్మక ప్రదర్శనలు పట్టణ ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి.


ఎన్టీఆర్ పార్క్‌లో సభ
ఫిబ్రవరి 12న ఎన్టీఆర్ పార్క్ వద్ద నిర్వహించిన సభలో IFTU రాష్ట్ర సహాయ కార్యదర్శి యు. వెంకటేశ్వరరావు, ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ జాతీయ నాయకురాలు అక్కినేని వనజ మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం గత 11 ఏళ్లుగా రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు, ప్రభుత్వ రంగ సంస్థలకు నష్టం కలిగించే విధానాలు అమలు చేస్తోందని విమర్శించారు. ఎన్నో పోరాటాలు, త్యాగాల ద్వారా సాధించిన 44 కార్మిక చట్టాల్లో 29 చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లుగా మారుస్తున్నారని ఆరోపించారు. ఈ కార్మిక వ్యతిరేక విధానాల వల్ల భవిష్యత్తులో కార్మికులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్మిక హక్కులను హరిస్తున్న మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు కార్మిక వర్గానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. విధానాలు మార్చుకోకపోతే రానున్న రోజుల్లో భారీ స్థాయిలో ఉద్యమాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు.

నాయకుల ప్రసంగాలు
సభకు IFTU జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకటరావు, AITUC జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. రైతు కూలి సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎండి. భాషా, INTUC జిల్లా నాయకులు రామ్మోహన్ రావు, ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కాళే శ్రీనివాసరావు ప్రసంగించారు.

వైసీపీ నాయకులు అబ్బాయి చౌదరి, జేపి తదితరులు సమ్మెకు సంఘీభావం ప్రకటించారు.

విస్తృతంగా పాల్గొన్న నాయకులు
ఈ కార్యక్రమంలో IFTU ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి యర్రా శ్రీనివాసరావు, AITUC ఏలూరు ఏరియా నాయకులు పుప్పాల కనబాబు, IFTU నాయకులు విజయలక్ష్మి, మంగం అప్పారావు, దూళ్ల వీరనాయుడు, PDSU జిల్లా అధ్యక్షుడు కాకినాని, నవ్వుడు నెహ్రూ బాబు, జి. చంద్రశేఖర్, బి. వీరభద్రం, తాతా నాగేశ్వరరావు, చిన్నబ్బాయి, బెజవాడ పద్మ, రాచీటి జాను, రవి, ఈశ్వరమ్మ, సూరిబాబు, మీసాల రమణ, రత్నబాబు, సంపంగి ప్రసాద్, పల్లి గంగరాజు, నకిరెడ్డి లక్ష్మణ్, కోరడ అప్పారావు, పల్లెం కిషోర్, జిల్లా కార్యదర్శి కృష్ణ చైతన్య, ఉప్పులూరు హేమశంకర్, BKMU పొట్టేలు పెంటయ్య, పేచ్చేటి శ్రీనివాసరావు, ప్రభాకర్, అప్పలరాజు, భజంత్రి శ్రీనివాసరావు, కడుపు కన్నయ్య, అన్నవరం, సంధకం అప్పారావు, లొట్ల సత్యనారాయణ, లింగమిల్లి శ్రీనివాసరావు, సత్యవతి, పిచ్చియ్య, రాము, పాతాళ అప్పారావు, గంగాధర్, సాంబశివరావు, నూకరాజు, అనసూయ, రూప, కుమార్, కాకర్ల శ్రీను, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు లావేటి కృష్ణ, జి.బాలు, బంగారు వెంకటేశ్వరరావు, రాజు, బండి రాజు, ప్రభాకర్, సామ్రాజ్యం, సత్యవతి, చంద్రావతి, పాప, బండి భవాని, వీధి వ్యాపారులు మరియమ్మ, సూర్యనారాయణ, అప్పారావు, నాయుడు తదితరులు పాల్గొన్నారు. సార్వత్రిక సమ్మెతో ఏలూరు నగరంలో కార్మిక సంఘాలు తమ ఐక్యతను ప్రదర్శించగా, నాలుగు లేబర్ కోడ్లపై తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశాయి.